iDreamPost
android-app
ios-app

కోనసీమలో అప్పుడే మొదలైన సంక్రాంతి.. హైటెక్ హరిదాసు వీడియో వైరల్

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. మూడు రోజుల పాటు సాగిపోయే ఈ పండుగ అంటే చిన్నా, పెద్దా అందరికీ ఇష్టం. అయితే కోనసీమ ప్రాంతంలో ఈ పండుగ హడావుడి ఇంకా ముందే మొదలవుతుంది. హరిదాసులు వచ్చి.. సందడి చేస్తుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. మూడు రోజుల పాటు సాగిపోయే ఈ పండుగ అంటే చిన్నా, పెద్దా అందరికీ ఇష్టం. అయితే కోనసీమ ప్రాంతంలో ఈ పండుగ హడావుడి ఇంకా ముందే మొదలవుతుంది. హరిదాసులు వచ్చి.. సందడి చేస్తుంటారు.

కోనసీమలో అప్పుడే మొదలైన సంక్రాంతి..  హైటెక్ హరిదాసు వీడియో వైరల్

సంక్రాతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెద.. అనే పాట అందరికి గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు వారికి పండుగల్లో అతి పెద్ద పండుగ ఏది అంటే ఠక్కున చెప్పే పేరు సంక్రాతి. దీనిని మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక సంక్రాతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. ఎన్నోన్నో అనుభూతులు, భావోద్వేగాలు.. ఇంకా చెప్పాలంటే.. ఏడాదికి సరిపోయే మధురమైన తీపి జ్ఞాపకాలు. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ గుర్తుకొస్తుంది. దాదాపు నెల రోజుల ముందే సంక్రాంతి పండగ సందడి మొదలవుతుంది. ఇక సంక్రాంతి నాటికి పల్లెల్లో పంటలు చేతికి రావడంతో పాటు కొత్త అల్లుళ్ళు, బంధుమిత్రులతో సంబరాలు చేసుకుంటూ, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు.

 కాగా, సంక్రాతి అనగానే ముందుగా అందరికి గుర్తు వచ్చేవి.. భోగి పంటలు, గొబ్బెమ్మలతో ముగ్గులు, సంప్రదాయ పంచకట్లు, గంగిరెడ్లూ, బసవన్నలు హరిదాసు కీర్తనలు. వీటితోనే పండగ సందడి అనేది ప్రతి ఒక్క ఇంటికి తీసుకొస్తుంది. అయితే సాధారణంగా హరిదాసులు అంటే చేతిలో చిడతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి ఉన్న పంచకట్టు, ఒక కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిరునామంతో హరిలో రంగ హరి అంటూ కీరిస్తూ.. వీధి వీధికి తిరుగుతుంటారని అందరికి తెలుసు. కానీ, తాజాగా అమలాపురంలో మాత్రం దీనికి భిన్నంగా హైటెక్ హరిదాసులు సందడి చేస్తున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..హిందువులు అందరికి హరిదాసుడు పరమాత్మతో సమానం అనే నమ్మకం. ఈ క్రమంలో హరిదాసులు నెలరోజులు ప్రతి వీధిలో ఇంటింటికి హరినామన్ని గానం చేస్తూ తిరుగుతుంటారు.

అలాగే సంక్రాతి రోజున హరిదాసులు స్వయంపాకం అందుకుని.. ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని ప్రజలను దీవిస్తారు. కాగా మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ పెరగడంతో.. ప్రస్తుతం హరిదాసుల గమనంలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నడుచుకుంటూ ఇంటి ఇంటికి చేరుకునే హరిదాసులు ఇప్పుడు హై టెక్ పద్దతులను పాటిస్తున్నారు. పండగ నెల ప్రారంభం కావడంతో.. అమలాపురంలోని హైటెక్ హరిదాసులు సందడి చేస్తున్నారు. అసలు హరిదాసులు అంటే నెత్తిపై కంబలి పెట్టుకుని నడుచుకుంటూ ఇంటింటా తిరుగుతూ హరి రామ సంకీర్తనలు చేస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం మోటర్ బైక్లపై హైటెక్ హరిదాసులు తిరుగుతున్నారు. అలాగే డీజే సౌండ్స్ పెడుతూ ఇంటింటా తిరిగి స్వయంపాకం అందుకుంటున్నారు. కాగా ఈ హైటెక్ హరిదాసులు జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. మరి, ఈ హైటెక్ హరిదాసులు సందడి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.