iDreamPost
android-app
ios-app

చంద్రబాబు.. పుంగనూరు నుంచి అల్లర్లకు పాన్ల్ చేశారు: సజ్జల

చంద్రబాబు.. పుంగనూరు నుంచి అల్లర్లకు పాన్ల్ చేశారు: సజ్జల

ఇటీవల చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులకు  పాల్పడిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు.. పోలీసులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈక్రమం 13 మందిలో పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.  రణధీర్ అనే కానిస్టేబుల్ ఎడమ కన్ను చూపును కోల్పోయాడు. దాడులకు పాల్పిడిన టీడీపీ వాళ్లే..తిరిగి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుంగనూరు ఘటనపై ప్రభుత్వం సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడుతూ..”పుంగనూరు ఘటనతో చంద్రబాబు వికృతానందం పొందారు. పుంగనూరు లో దాడిలు చేసి.. అక్కడి నుంచి రాష్ట్రమంత అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఎన్నికలు సమీపిస్తుంటే పవన్ ను దగ్గర పెట్టుకొని చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. పుంగనూరు ఘటనలో ఆధారాలతో సహా చంద్రబాబు దొరికారు. పోలీసులు సంయమనంగా ఉండటంతో చంద్రబాబు పాచిక పారలేదు. పుంగనూరులో అల్లరు సృష్టించింది.. చంద్రబాబు, ఆయన గ్యాంగే. నాయకుడు  అంటే గొడవలను ఆపే వాడు, కానీ చంద్రబాబు మాత్రం రెచ్చగొట్టారు.

పోలీసులంటే చంద్రబాబుకు చులకన భావం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. ఇలా ప్రవర్తించడం సిగ్గు చేటు. ఉన్నాదులుగా వ్యవహరించిన వారు అసలు కార్యకర్తలా?. పుంగనూరు ఘటనలో దాడులకు పాల్పడిన వారు.. చంద్రబాబు హాయంలో  ట్రైనింగ్ అయినా ఉన్నాది ముఠా. ఎలాగైన అధికారంలోకి రావాలని చంద్రబాబు  తపన పడుతున్నారు. అసలు ఇలాంటి కరుడుగట్టిన వ్యక్తులను సినిమాల్లోనే చూసేవాళ్లం. కానీ చంద్రబాబు రూపంలో ఇప్పుడు నిజంగానే చూస్తున్నాం. చంద్రబాబు లాంటి గుంటనక్కల ఆటలు సాగనీయం” అని సజ్జల హెచ్చరించారు. మరి.. చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చిరంజీవి.. ముందుగా పవన్ కు సలహాలివ్వాలి: మంత్రి రోజా

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet