iDreamPost
android-app
ios-app

పెళ్లి మండపంలో విషాదం! స్మోక్ గ్యాస్ సిలిండర్ పేలి..

పెళ్లి అంటే ఆ సందడి వేరే లెవెల్ ఉంటుంది. బంధువులు,స్నేహితులతో పెళ్లి ఇంట్లో సందడి నెలకొంటుంది. అయితే కొన్ని సార్లు అనుకోని ప్రమాదం సంభవించి.. పెను విషాదాన్నిజరుగుతుంది. తాజాగా చిత్తూరులోని ఓ పెళ్లి మండపంలో విషాదం చోటుచేసుకుంది.

పెళ్లి అంటే ఆ సందడి వేరే లెవెల్ ఉంటుంది. బంధువులు,స్నేహితులతో పెళ్లి ఇంట్లో సందడి నెలకొంటుంది. అయితే కొన్ని సార్లు అనుకోని ప్రమాదం సంభవించి.. పెను విషాదాన్నిజరుగుతుంది. తాజాగా చిత్తూరులోని ఓ పెళ్లి మండపంలో విషాదం చోటుచేసుకుంది.

పెళ్లి మండపంలో విషాదం! స్మోక్ గ్యాస్ సిలిండర్ పేలి..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన, మరపురాని ఘట్టం. అందుకే ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలని యువత ఎన్నో కలలు కంటుంది. అంతేకాక వధువరుల కుటుంబ సభ్యులు కూడా తమ ఇంట్లో పెళ్లి కావడంతో ఎంతో సంతోషంలో మునిగిపోతారు. ఇక పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులతో ఇరు కుటుంబ సభ్యులు పలకరింపు చేస్తుంటారు. ఇలా ఎంతో సందండిగా సాగే కొన్ని వివాహాల్లో అనుకోని ప్రమాదాలు జరిగి.. విషాదాన్ని నింపుతాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. స్మోక్ గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన వరుడు, నారాయణవనానికి చెందిన వధువుల పెళ్లి వేడుక ఏర్పాట్లు జరిగాయి. బుధవారం రాత్రి పుత్తూరు మండలం పరమేశ్వరమంగళం సమీపంలోని జీవీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వాహానికి ఏర్పాట్లు చేసి రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. వీరి పెళ్లి ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అలానే నారాయణవనం మండలం కశింమిట్ట గ్రామానికి చెందిన గుణశేఖర్, మీనా దంపతులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. వీరితో పాటు కుమార్తె చాందిని(15) కూడా వెళ్లింది.

ఇక పెళ్లి మండపంలో చాలాసేపు సందడిగా తిరిగిన చాందిని.. కొద్ది క్షణాల తరువాత విగతజీవిగా మారింది. పెళ్లి మండపంలో ఏర్పాటు చేసిన స్మోక్ గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ పక్కనే ఉన్న చాందినికి బలమైన గాయమైంది. బాలిక ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సమీపంలోనే పుత్తూరు ఆస్పత్రికి తరలించారు.  అప్పటికే చాందిని మృతి చెందినట్లు వైద్యులు  నిర్ధారించారు. దీంతో అప్పటి వరకు పెళ్లి మండపంలో సందడిగా  ఉన్న వాతావరణం మృత్యుఘోష వినిపించింది. మృతురాలు చాందిని నారాయణవనం బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై వెంకట మోహన్,  పుత్తూరు అగ్నిమాపక కేంద్ర ఆఫీసర్ నేతాజీ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఫ్లవర్ ఎక్స్ పోజర్ కోసం వాడే సిలిండర్ తీగలు నాణ్యంగా లేకపోవడంతో సిలిండర్ పేలినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు సందడి చేసిన తమ బిడ్డ.. ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. వీరి చూసిన.. తోటి వారు సైతం కన్నీరు పెట్టుకున్నారు. ఇలా గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో చోటుచేసుకుంటా. వీటి కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. మరి.. పెళ్లి మండపంలో జరిగిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.