iDreamPost
android-app
ios-app

RTC ప్రయాణికులకు అదిరిపోయే బంపర్ ఆఫర్!

  • Published Oct 11, 2023 | 11:23 AM Updated Updated Oct 11, 2023 | 11:23 AM
  • Published Oct 11, 2023 | 11:23 AMUpdated Oct 11, 2023 | 11:23 AM
RTC ప్రయాణికులకు అదిరిపోయే బంపర్ ఆఫర్!

తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎన్నికల హడావుడి మరోవైపు పండుగల హడావుడి మొదలైంది. దసరా పండుగ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్ చార్జీలు తగ్గించడం, బస్సుల సంఖ్య మరింతగా పెంచడం లాంటివి చేస్తున్నారు. గత ఏడాది దసరా, దీపావళి పండుగలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా భారీగా లాభాలు అర్జించారు. ఈ ఏడాది కూడా మరిన్ని వసతీ సౌకర్యాలతో పాటు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు ఆర్టీసీ యాజమాన్యం. దీంతో ప్రయాణికులకు మంచి లాభం చేకురడమే కాదు.. ప్రయాణాలు కూడా సురక్షితంగా సాగుతాయిన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గొప్ప శుభవార్త తెలిపింది. విజయదశమి సందర్భంగా బస్సుల్లో టికెట్ చార్జీలపై పది శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు తెలిపారు. గతంలో ప్రత్యేక బస్సులకు యాభై శాతం అదనపు చార్జీలు వసూళ్లు చేసేవారని.. రెండు సంవత్సరాల నుంచి ఆ భారం లేకుండా చూస్తున్నామని ఆయన అన్నారు. గత సంవత్సరం పండుగ సందర్భంగా రాను పోను రెండు వైపులా టికెట్ తీసుకుంటేనే పది శాతం రాయితీ వర్తించేదని.. కానీ ఈసారి మాత్రం ఏ ఒక్క వైపు టికెట్ తీసుకున్నా ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు. అంటే రాను పోను చార్జీల్లో పది శాతం చొప్పున 20 శాతం రాయితీ కల్పిస్తున్నామని వివరించారు.

ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు కల్పించి ఓఆర్ పెంచి ఆదాయం పెంపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు తెలిపారు. త్వరలో 1500 డిజిల్ ఇంజన్ బస్సులు, వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిబ్బంది సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పీఎఫ్ సొమ్ము సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతేకాదు తమ ఉద్యోగులకు హయ్యర్ పెంఛన్ అమలు చేయనున్నామని.. మొదట 8500 మందికి దీన్ని వర్తింపజేస్తామని ఎండీ తెలిపారు. ఇక దసరా పండుగ సందర్భంగా ప్రత్యేకంగా 5500 బస్సులను నడపనున్నట్లు ఆయన తెలిపారు.