SNP
SNP
దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక నివేదికలో తెలిపింది. తక్కువ వర్షపాతం కారణంగా గతేడాది కంటే పంట దిగుబడిలో కోత పడే అవకాశం ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. బిపర్ జాయ్ తుపాను కారణంగా రుతుపవనాలు ఆసల్యం అవుతున్నాయని, దీంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే.. పంట ఉత్పత్తి చాలా తక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ధరల పెరుగుల ప్రభావం ఎక్కువ పడనుంది.
వరి ఉత్పత్తి ఎక్కువగా చేసే ఏపీ, తెలంగాణ, యూపీ వంటి రాష్ట్రాలపై ధరల పెరుగుదల ప్రభావం తక్కువ ఉండనుంది. పైగా ఈ రాష్ట్రాల్లో మెరుగైన నీరు పారుదల వ్యవస్థ ఉండటం కూడా ధరల పెరుగుదల ప్రభావం తక్కువ పడేందుకు తోడ్పడుతుంది. మొదటి నుంచి వరి ఉత్పత్తిలో యూపీ, ఏపీ పోటీ పడుతుండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందించడంతో వర్షాభావం ఎదురైనా పెద్దగా ప్రభావం పడటం లేదు.
అయితే.. ప్రస్తుతం ఉన్న ఇతర అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు బియ్యం ధరల పెరుగుదల మరింత ఇబ్బంది పెట్టనుంది. కూరగాయల ధరలు కొండెక్కాయి. టమాటా ధర అయితే సెంచరీ దాటిపోయింది. పెరిగిన ధరలకు టమాటా కొనలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. వీటికి తోడు రానున్న రోజుల్లో బియ్యం ధరలు కూడా పెరగనుండటం సామాన్య జనాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి బియ్యం ధరల పెరుగుదలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: లంక భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!