iDreamPost

లంక భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

లంక భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రైతుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. వివిధ పథకాల ద్వారా రైతులను ఆర్థికంగా జగన్ సర్కార్ ఆదుకుంటుంది.  అలానే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు. చుక్క భూములు కలిగిన రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలు సీఎం జగన్ తీసుకుంటున్నారు. తాజాగా లంక ప్రాంత భూముల విషయంలో కూడా మరో కీలక నిర్ణయ తీసుకోనున్నారు.

కృష్ణా, గోదావరి  నదీ తీరంలో ఉన్న లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చేందుకు జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఎనిమిది జిల్లాలలో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19 వేల మందికిపైగా  రైతులకు ఈ-పట్టాలు ఇవ్వనుంది. ఇక ఈ నిర్ణయానికి మంత్రివర్గం  ఆమోదముద్ర వేయడమే తరువాయి. మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్రపడ్డ  తర్వాత పట్టాల పంపిణీ ప్రారంభం కానుంది.  రాష్ట్రంలో నిరు పేదలకు 54 వేల ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ భూములతో పాటే.. లంక భూములను పంపిణి చేయనున్నారు. లంక భూములను సాగు చేసుకుంటున్న  రైతులకు డి-పట్టాలు ఇవ్వనున్నారు. ఈ భూములను మూడు కేటగిరీలుగా విభజించారు.

నది సమీపంలో ఉండి.. వరద వచ్చినా కొట్టుకుపోని భూమిని ఏ-కేటగిరీ కింద,  వీటిని ఆనుకుని కొంత నదిలోకి ఉన్న భూమిని బి- కేటగిరీగా , ఇక నదిలోకి ఉండి వరదలోస్తే పూర్తిగా మునిగిపోయే భూమిని సీ-కేటగిరీగా విభజించారు. అలాగే నిబంధనలకు అనుగుణంగా లంక భూముల కేటగిరీలను మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై లంక ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టాలివ్వాలని అక్కడి రైతులు అనేక ఏళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నా పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత  వారి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్ధమైంది.  మరి.. జగన్ సర్కార్ తీసుకుంటున్నా ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి