Arjun Suravaram
wives Support To Husband Marriage: సాధారణంగా ఏ భార్య అయినా భర్త వేరే అమ్మాయిని చూస్తేనే తట్టుకోలేదు. ఓ వ్యక్తి మూడో పెళ్లి చేసేందుకు ఆయన ఇద్దరు భార్యలు ఒప్పుకున్నారు.ఇద్దరు భార్యల ముద్దుల భర్త కాస్తా ముగ్గురు భార్యల ముద్దుల మొగుడయ్యారు. మరీ.. ఆస్టోరీ ఏమిటంటే
wives Support To Husband Marriage: సాధారణంగా ఏ భార్య అయినా భర్త వేరే అమ్మాయిని చూస్తేనే తట్టుకోలేదు. ఓ వ్యక్తి మూడో పెళ్లి చేసేందుకు ఆయన ఇద్దరు భార్యలు ఒప్పుకున్నారు.ఇద్దరు భార్యల ముద్దుల భర్త కాస్తా ముగ్గురు భార్యల ముద్దుల మొగుడయ్యారు. మరీ.. ఆస్టోరీ ఏమిటంటే
Arjun Suravaram
సాధారణంగా పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూస్తేనే ఏ భార్య సహించదు. అలాంటి మరొక అమ్మాయితో పెళ్లి అంటే ఊరుకుంటారా?. భద్రకాళిలాగా మారి చీల్చి చెండాడేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే సమాజంలో అత్యంత అరుదుగా జరిగే సంఘటన చోటుచేసుకుంది. ఒక భార్య ఉండగా మరొక పెళ్లికే ఎవ్వరు ఒప్పుకోరు. అలాంటి.. ఇద్దరు భార్యాలు కలిసి..తమ భర్తకు పెళ్లి చేశారు. అయితే ఇలా చేయడానికి వాళ్లు చెప్పిన కారణం తెలిస్తే.. షాకవ్వకమానరు. మరి.. అసలు ఆ ఇద్దరు మహిళు తమ భర్తకు ఎందుకు మూడో పెళ్లి చేశారు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కించూరు గ్రామంలో ఉంటున్న సాగేని పండన్నకి మూడో పెళ్లి జరిగింది. తన సమీప బంధువైన లక్ష్మీతో ఆయన మూడో వివాహం జరిగింది. ఆ వివాహం కూడా.. ఇద్దరి భార్య అంగీకారంతోనే జరిగింది. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే పండన్నకు తన ఇద్దరు భార్యాలు మూడో పెళ్లి ఎందుకు చేశారు అనే విషయం బయటకు వచ్చింది. వాళ్లు అలా చేయడానికి కారణం తెలిస్తే..మీరు షాకవుతారు.
కించూరు గ్రామానికి చెందిన పండన్న..ఆయన తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. వారు పండన్న చిన్నతనంలోనే చనిపోవడంతో..ఒంటరిగా మిగిలిపోయాడు. అలా చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రేమకు, నా అనే వారి ఆప్యాయతకు దూరమయ్యాడు. ఇక బాల్యం నుంచి కూలీ పనులు చేసుకుంటూ ఒక్కటే పెరిగి పెద్దయ్యాడు. 2001లో పండన్నకు అప్పలమ్మతో తొలి వివాహం జరిగింది. నాలుగేళ్లైన సంతానం లేకపోవడంతో ఇద్దరు తీవ్ర ఆవేదనకు గుర్యయారు. అనాథగా పెరిగిన పండన్నకు పిల్లలు లేకపోవడం కలచి వేసింది. ఈ క్రమంలోనే తన భర్తకు మరో పెళ్లి చేయాలని అప్పలమ్మ నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే 2005లో పార్వతమ్మ అనే మహిళలో పండన్నకు రెండో వివాహం జరిగింది. అప్పలమ్మే స్వయంగా దగ్గరుండి వీరి పెళ్లి చేసింది. ఇక పార్వతమ్మకు ఓ బిడ్డ పుట్టాడు. తనలాగా తన కుమారుడు ఒక్కడే అయితే అనాథగా పెరుగుతాడని ఆందోళన చెందాడు. అందుకే మరో పాప లేదా, బాబునో పుడితే వాడికి తోడుగా ఉంటారని భావించాడు. అందుకే మరో బిడ్డ కోసం ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో భర్త పండన్న బాధను అర్థం చేసుకున్న ఆ ఇద్దరు భార్యలు.. మూడో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక తమ సమీప బంధువైన లక్ష్మీని పెద్దల ద్వారా రాయబారం పంపి మూడో పెళ్లికి ఒప్పించారు. అలా అందరి అంగీకారంతో పండన్నకు ముచ్చటగా మూడో పెళ్లైంది.మరి భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.