iDreamPost
android-app
ios-app

పవన్ పై RGV పోటీ.. పిఠాపురం నుంచి బరిలోకి దిగుతానంటూ..

RGV From Pithapuram: రామ్ గోపాల్ వర్మ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయాన్ని వెల్లడించారు. తాను వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై బరిలోకి దిగబోతున్నారు.

RGV From Pithapuram: రామ్ గోపాల్ వర్మ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయాన్ని వెల్లడించారు. తాను వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై బరిలోకి దిగబోతున్నారు.

పవన్ పై RGV పోటీ.. పిఠాపురం నుంచి బరిలోకి దిగుతానంటూ..

పవన్ కల్యాణ్ తన పోటీపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించిన విషయం తెలిసిందే. తాను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్న విషయాన్ని స్వయంగా తానే ప్రకటించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షాకిచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తాను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగుతానంటూ రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఇది అనుకోకుండా సడెన్ గా తీసుకున్న నిర్ణయం అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ తన పోటీకి సంబంధించి అధికారిక ప్రకటన చేసిన కొద్దిసేపటికే రామ్ గోపాల్ వర్మ తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అంటూ ప్రకటన చేశాడు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ పోటీకి దిగుతున్నారు అనగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. జనసేన, పవన్ కల్యాణ్ పరిణతిలేని నిర్ణయాలను ఎండగట్టే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్నాను అంటూ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇన్నాళ్లలో ఎప్పుడూ రామ్ గోపాల్ వర్మ తాను రాజకీయాల్లోకి రాబోతున్నాను అని గానీ.. వస్తాను అని గానీ ఎప్పుడూ చెప్పలేదు. ఇలా పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత ఆర్జీవీ ట్వీట్ చేయడం ఆసక్తిగానే కాకుండా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. రామ్ గోపాల్ వర్మ ఎలా పోటీ చేయబోతున్నారు? రామ్ గోపాల్ వర్మ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఎవరు ఆయనకు టికెట్ ఇస్తారు? ఒకవేళ రామ్ గోపాల్ వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అని చాలానే ప్రశ్నలు ఉన్నాయి. వాటికి మాత్రం ఆర్జీవీ సమాధానాలు చెప్పలేదు. ఎలాంటి ప్రస్తావన లేకుండా సడెన్ డెసిషన్ అంటూ పిఠాపురం నుంచి బరిలోకి దిగబోతున్నాను అనేశారు. అయితే ఇది పవన్ కల్యాణ్ ని కంగారు పెట్టడానికి చేశారా? నిజంగానే రాజకీయాల్లోకి రాబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

రామ్ గోపాల్ వర్మ ప్రకటన తర్వాత నెటిజన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గురూజీ మీరు రాజకీయాల్లోకి రావాలి అంటూ వెల్ కమ్ చెప్తున్నారు. మీరు సరైన స్థానాన్ని, సరైన ప్రత్యర్థిని ఎంచుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సినిమాలు, ట్వీట్లతో ఇరుకున పెడితే.. ఈసారి ఏకంగా రాజకీయ బరిలోనే ముప్పతిప్పలు పెట్టేందుకు డిసైడ్ అయ్యారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి అటూ ఆకాంక్షిస్తున్నారు. మరి.. పవన్ కల్యాణ్ పై బరిలోకి దిగేందుకు సిద్ధమైన రామ్ గోపాల్ వర్మ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.