iDreamPost
android-app
ios-app

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

గత కొద్దిరోజుల నుంచి వర్షాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు ఎండలు పెడుతున్నప్పటికి.. మరో వైపు వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల పగలు ఎండలు.. రాత్రి వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిరు జల్లులనుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్‌ నగరంతో పాటు  కరీంనగర్‌, ములుగు, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లా, నిర్మల్‌, మంచిర్యాల, నల్గొండ, మహబూబాబాద్‌, జగిత్యాల, వికారాబాద్‌ జిల్లాల్లో నిన్నటి లాగే మరోసారి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది. పెరుగుతున్న ఉష్టోగ్రతల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల తుఫానులు వచ్చే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక, ఏపీలో కూడా వర్షాలు బాగా కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల్లో కదలిక, రాష్ట్రంపై నైరుతి, పశ్చిమ గాలులు వీయటంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరి, తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు విజృంభిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.