తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. భారీ వర్షాలు! ఎక్కడంటే..?

Heavy Rains Telugu States: ఈ ఏడాది మార్చి నుంచి ఎండటలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండ వేడికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇలాంటి సమయంలో ఐఎండీ చల్లటి కబురు అందించింది.

Heavy Rains Telugu States: ఈ ఏడాది మార్చి నుంచి ఎండటలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండ వేడికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇలాంటి సమయంలో ఐఎండీ చల్లటి కబురు అందించింది.

ఈ ఏడాది ఎండలు భగ భగ మండిపోతున్నాయి. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు దంచికొట్టాయి. ఉదయం 9 గంటల నుంచి మొదలై 6 గంటల వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మే నెల చివరి వారంలో ఎండలు విజృంభించాయి. ఒకదశలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లాంలటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. రోహిణి కార్తె సందర్బంగా ఎండల తీవ్ర మరింత పెరిగిపోయింది. ఎండలకు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఎండవేడిమి తట్టుకోలేక ప్రజలు శీతల పానియాల వెంట పడుతున్నారు. ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఆదివారం (జూన్ 2) మధ్యాహ్నం నుంచి వరుసగా మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదరుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చెల్చ్, మల్కాజ్ గిరి, హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అత్యవసర పనులు అయితేనే బయటకు వెళ్లాలలని సూచించింది. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి విపత్తులు ఎదరైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇదిలా ఉంటే నల్లగొండ, సూర్యపేట, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ,గద్వాల్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండి.

ఇక ఏపీ విషయానికి వస్తే.. ఆదివారం నైరుతి రుతు పవనాలు కేరళా తీరాన్ని తాకనున్న సంగతి తెలిసిందే.. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామారాజు, శ్రీ సత్యసాయి, పార్వతీపూరం, విజయనగరం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కోనసీమ, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో పాటు మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Show comments