P Krishna
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. పలు జిల్లాలో భారీగా వానలు కురిశాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఏపీలో పలు జిల్లాలపై పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. పలు జిల్లాలో భారీగా వానలు కురిశాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఏపీలో పలు జిల్లాలపై పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
P Krishna
గత పది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో దట్టంగా మేఘావృతమై ఉంటుంది. బంగాళా ఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో సోమవారం 27న అల్ప పీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపారు. దీంతో.. కోస్తా, రాయలసీమ జిల్లాలో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపిలో నేడు పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, కడప అన్నమయ్య, నంద్యాల, తిరుపతి, చిత్తూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉత్తర కోస్తా, యానాంలో నేడు, రేపు తెలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇక దక్షిణ కోస్తాలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. అలాగే రాయల సీమలో సైతం నేడు, రేపు తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు.
ఇదిలా ఉంటే వాతావరణ శాఖ హెచ్చరికతో వరి రైతుల్లో ఆందోళన మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరికోత సిద్దంగా ఉందని.. ఇప్పుడు గనక వర్షాలు పడితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదనకు గురవుతున్నారు. కొంతమంది రైతులు వరి పైరు కోసి.. ధాన్యం ఆరబోసినట్లు తెలుపుతున్నారు. వర్షాలు పడితే దాన్యం కుప్పలు తడిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఏపిలో పలు ప్రాంతాల్లో పత్తి పొలాల్లో పత్తి ఇంకా తీయాల్సి ఉంది.. వర్షం పడితే పత్తి రేటు దారుణంగా పడిపోతుందని పత్తిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ష ప్రభావం స్వల్పంగా ఉంటే కాస్త ఊపిరి పీల్చుకోవొచ్చు. అయితే వరి ధాన్యం కుప్పలు పెట్టిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.