Rain Alert: అలర్ట్.. మళ్ళీ కురవనున్న వానలు.. ఈ జిల్లాలపై ప్రభావం!

Rain Alert: అలర్ట్.. మళ్ళీ కురవనున్న వానలు.. ఈ జిల్లాలపై ప్రభావం!

Rains In These Districts: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి అనుకున్న సమయంలో మరోసారి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Rains In These Districts: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి అనుకున్న సమయంలో మరోసారి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, జలాశయాలు నిండిపోయాయి. రెండేళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను.. అటు నాగార్జున సాగర్ గేట్లను తెరిచారు. గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రానురాను వర్షాలు తగ్గడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. అయితే వరుణుడు షార్ట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రతాపం చూపించనున్నాడు. ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయని.. ఆదివారం నాడు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరోవైపు వాతావరణ శాఖ కూడా వర్షాల గురించి అప్డేట్ ఇచ్చింది. రాబోయే రెండు రోజుల పాటు ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆదివారం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలానే సోమవారం ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమలోనూ ఒకట్రెండు చోట్ల వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.           

Show comments