Dharani
ఏపీలోని రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ జారీ చేశారు. సుమారు 26 రైళ్లను.. 45 రోజుల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
ఏపీలోని రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ జారీ చేశారు. సుమారు 26 రైళ్లను.. 45 రోజుల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
Dharani
ఈమధ్య కాలంలో రైల్వే శాఖకు సంబందించిన వార్తలు అధికంగా వస్తున్నాయి. టికెట్ బుకింగ్, రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి వార్తలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీ ద్వారా.. కుటుంబ సభ్యులకు కాకుండా.. ఇతరులకు రైలు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది. అలానే ఇకపై రైళ్లలో జనరల్ బోగీలు పెంచేందుకు కూడా రైల్వే శాఖ రెడీ అవుతోంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కనీసం నాలుగు జనరల్ బోగీలు ఉండేలా.. అది కూడా వరుసగా ఉండేలా చూడాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రయాణికులకు ఆశాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రం నుంచి వెళ్లే పలు రైళ్లను సుమారు 45 రోజుల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ లిస్ట్ మీకోసం..
రైల్వే శాఖ ఏపీ నుంచి వెళ్లే 26 రైళ్లను సుమారు 45 రోజుల పాటు రద్దు చేసింది. వీటిల్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే శాఖ నిర్ణయం వల్ల విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. పైగా రైల్వే శాఖ ఉన్నట్లుండి ఈ రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు ముఖ్యమైన కారణమే ఉందంటున్నారు. గతేడాది నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని.. విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునీకీకరణ పనులు జరుగుతున్నాయని రైల్వే అధికారలు తెలిపారు. ఇప్పటికే అనేక కారణాల వల్ల ఈ పనులు ఆలస్యం అయ్యాయని.. తప్పనిసరి పరిస్థితుల్లో.. రైళ్లను రద్దు చేయాల్సి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
కాకినాడ టౌన్-తిరుపతి(17249), మచిలీపట్నం-విశాఖపట్నం(17219) ఎక్స్‌ప్రెస్, పుదుచ్చేరి-కాకినాడ పోర్టు(17643) సర్కార్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు-రాయగడ (17243), కాకినాడ టౌన్-లింగంపల్లి(12775) సూపర్‌ఫాస్ట్, విశాఖపట్నం-మహబూబ్‌నగర్(12861) సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆదివారం నుంచి రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం-మచిలీపట్నం (17220), కాకినాడ టౌన్-తిరుపతి(17250), రాయగడ-గుంటూరు(17244) ఎక్స్‌ప్రెస్‌లు, మహబూబ్ నగర్-విశాఖపట్నం(12862) కాకినాడ పోర్టు-పుదుచ్చేరి (17644) సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమహేంద్రవరం-విశాఖపట్నం, కాకినాడ పోర్టు-విజయవాడ మధ్య నడిచే రైళ్లను సోమవారం నుంచి రద్దు చేశారు. అలాగే కడియం – నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ ఆధునికరణ కోసం.. ఆగస్టు 10వ తేదీ వరకు అంటే సుమారు నెలన్నర పాటు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.