iDreamPost
android-app
ios-app

ఇంగ్లిష్ లేక చాలా నష్టపోయాం.. సీఎం జగన్ నిర్ణయం గొప్పది: నారాయణమూర్తి

ఇంగ్లిష్ లేక చాలా నష్టపోయాం.. సీఎం జగన్ నిర్ణయం గొప్పది: నారాయణమూర్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కేజీ టూ పీజీ వరకు విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా విద్య అందేలా అనేక చర్యలు తీసుకున్నారు. అంతేకాక విద్యార్థుల కోసం పలు పథకాలను కూడా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి.. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కానీ చాలా మంది సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని ప్రశంసించారు. తాజాగా సినీ నటుడు, దర్శకులు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి.. సీఎం జగన్  తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదంటూ ప్రశంసించారు.

మనం పిల్లలకు అందించే నిజమైన ఆస్తి అంటూ ఏదైన ఉంది అంటే.. అది నాణ్యమైన విద్యమాత్రమే అని బలంగా నమ్మిన వ్యక్తి సీఎం జగన్. అంతేకాక ఇంగ్లీష్ మీడియంలో పేద విద్యార్థులు కూడా చదవాలని బలంగా సంకల్పించి.. సీఎం జగన్.. అటుగా కూడా చర్యలు తీసుకున్నారు. తొలుత పలువురు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన.. అసలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వలన కలిగే లాభాలు తెలుసుకుని సైలెంట్ అయ్యారు. ఎంతో మంది కార్పొరేట్ స్కూళ్లల్లో చదివేందుకు డబ్బులు లేక, ఇంగ్లీష్ మీడియంలో చదవక ఉద్యోగాలు పొందలేక పోయారు. అలా చాలా మంది తమ జీవితంలో ఇంగ్లీష్ మీడియం లేక నష్టపోయారు.

ఇదే విషయాన్ని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి కూడా తెలిపారు. పీపుల్స్ స్టార్ గా పిలుచుకునే ఈ దర్శకుడు పేపర్ల లీకేజీ ఇతివృతంతో ‘యూనివర్సిటీ’ అనే సినిమాను తెరకెక్కించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ..” ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం చాలా గొప్ప నిర్ణయం. ఇంగ్లిష్ మీడియంలో చదువుకోకపోవడం వల్ల నాలాంటి  వారు ఎంతో మంది ఉద్యోగాలు రాక నష్టపోయారు. ఇంగ్లిష్ లో చదువుకుంటే సామాన్యుల పిల్లలు కూడా ఉన్నత స్థితికి ఎదుగుతారు” అని నారాయణ మూర్తి తెలిపారు.

ఇదీ చదవండి: TTD ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి