iDreamPost

TTD ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

TTD ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా వైసీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డిని సీఎం జగన్ నియమించారు. గతంతో కూడా ఈయన టీటీడీ ఛైర్మన్ గా రెండు సార్లు పనిచేశారు. 2006-08 సమయంలో కూడా భూమన టీటీడీ ఛైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. త్వరలో ఈయన పదవి కాలం పూర్తి కానున్న నేపథ్యంలో తదుపరి ఛైర్మన్ భర్తీపై అనేక వార్తలు వినిపిస్తూ వచ్చాయి. పలువురి పేర్లు పరిశీలనలోకి కూడా వచ్చాయి. అందులో భూమన కరుణాకర్ రెడ్డి పేరు కూడా ఉంది. టీటీడీ ఛైర్మన్ గా ఎవరు నియమించబడతారనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్ గా ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుతం ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యునిగా కొనసాగుతున్నారు. వైఎస్సార్ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో భూమన కరుణాకర రెడ్డి జన్మించారు. ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎంఏ పట్టాపొందారు. ఇక రాజకీయాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భూమన సన్నిహితంగా ఉండేవారు. 2012లో తిరుపతి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో తిరుపతి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇక దివగంత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006-08 వరకు టీటీడీ ఛైర్మన్ గా పని చేశారు. కాగా తాజాగా మరోసారి టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. తనను టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. కరుణాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగానున్నారు. మరి.. టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి