ఆడపిల్లలు అనే కనికరం లేకుండా ప్రిన్సిపాల్ దాష్టికం!

Rampachodavaram: ఇటీవల చదువులు చెప్పే గురువులు విద్యార్థుల పట్ల దారుణాలకు తెగబడుతున్నారు. వారి దాష్టికానికి కొంతమంది విద్యార్థులు జీవితాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

Rampachodavaram: ఇటీవల చదువులు చెప్పే గురువులు విద్యార్థుల పట్ల దారుణాలకు తెగబడుతున్నారు. వారి దాష్టికానికి కొంతమంది విద్యార్థులు జీవితాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. ఆ పిల్లలకు చక్కటి విద్య, క్రమశిక్షణ నేర్పించి సమాజంలో గొప్ప పొజీషన్ కి చేరేలా చేసేది గురువులు. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా సరే గురువుకి గొప్ప స్థానం కల్పించబడింది. బ్రహ్మః, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరభ్రమ్మ, తస్మైశ్రీ గురవే నమః అంటూ త్రిమూర్తులతో పోల్చుతారు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది గురువు స్థానానికి మచ్చే తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. విద్యాసంస్థలకు మద్యం సేవించి రావడం, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, సైకోల్లా మారి దారుణంగా దండించడం లాంటివి చేస్తున్నారు. ఓ ప్రిన్సిపల్ చేసిన దారుణానికి బాలికలు దీన స్థితిలోకి వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా రంపచోడవరంలోని ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజ్ లో అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులను అక్కడి ప్రిన్సిపల్ వేధించడం, కొట్టడంతో బాలికల పరిస్థితి దారుంగా మారిపోయింది. క్రమశిక్షన పేరుతో ప్రిన్సిపల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి విద్యార్థినులతో మూడు రోజుల పాటు 100 నుంచి 200 గుంజీలు తీయించారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు. తాము చెప్పిన మాట వినడం లేదని ప్రిన్సిపల్, పీడీ శుక్రవారం విద్యార్థినులతో ఈ పని చేయించారు. సోమవారం కూడా అలాగే చేయడంతో కొంతమంది విద్యార్థినుల పరిస్థితి దారుణంగా మారిపోయి.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ప్రిన్సిపల్ దాష్టికానికి విద్యార్థినులు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితికి చేరుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు కాలేజీకి చేరుకుని పిల్లలను ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. కొంతమంది కోలుకోగా మరికొంతమంది పరిస్థితి అలాగే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, క్రమశిక్షణ పేరిట ఆడపిల్లలు అని కనికరం లేకుండా ప్రవర్తించిన ప్రిన్సిపల్, పీడీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి వెంటనే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలాన్ని ఆదేశించారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి వెళ్లిన శిరీషా దేవి బాలికలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తనతో చెప్పాలని బాలికలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

Show comments