iDreamPost
android-app
ios-app

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రాగులు, జొన్నలు పంపిణీ: మంత్రి నాగేశ్వరావు

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రాగులు, జొన్నలు పంపిణీ: మంత్రి నాగేశ్వరావు

ఫోర్టిఫైడ్ బియ్యం విషయంలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరావు కీలక విషయాలు వెల్లడించారు. గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో విలేకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యంను అన్ని జిల్లాల్లో పీడీఎస్, ఎండీఎం, ఐసీడీఎస్ ల ద్వారా పంపిణీ చేయనున్నామని మంత్రి నాగేశ్వరావు తెలిపారు. ఈ ఫోర్టి ఫైడ్ బియ్యంపై అపోహాలు అవసరం లేదన్నారు. ఈ  బియ్యంలో  ఐరన్, పోలీక్ ఆమ్లం, బి12 విటమిన్ ఉంటాయని, వీటి కారణంగా రక్తహీనత సమస్య తగ్గుతుందని తెలిపారు

మీడియా సమావేశంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ..” ఫోర్టిఫైడ్ బియ్యం కెర్నల్స్ ను సాధారణ బియ్యంలో 1:100 నిష్పత్తిలో కలపటం వల్లన పోషక బియ్యం తయారవుతాయి. ఈ బియ్యం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఫోర్టిఫైడ్ బియ్యంతో శరీరానికి పోషకాలు అందటమే కాకుండ విటమిన్స్ అందుతాయి. ఫోర్టిఫైడ్ బియ్యం వండే సమయంలో నీళ్లలో కలిపినప్పుడు అవి నీటిపై తేలటంతో ప్లాస్టిక్ అని అవగాహన లేని కొందరు అపోహ పడుతున్నారు.

మరికొందరు కావాలని ప్రభుత్వం ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తుందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహోన్నత ఆశయంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఫైలట్ ప్రాజెక్ట్ గా  ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పంపిణీ చేస్తుండగా ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పీడీఎస్, ఎండీఎం, ఐసీడీఎస్ ద్వారా అందించనున్నాము. ఫోర్టిఫైడ్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అనే అనుమానాలు తీరాలంటే మెడికల్ షాపుల్లో దొరికే అయోడిన్ ను తెచ్చి ఫోర్టిఫైడ్ బియ్యంపై వేస్తే నీలం రంగులోకి మారతాయి” అని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లోనే అందిస్తున్న రాగులు,జొన్నాలను, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నామని ఆయన తెలిపారు. అలానే వచ్చే సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ధాన్యం రైతులకు 5లేదా6 రోజుల్లో నగదు జమచేస్తామని హామి ఇచ్చారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి.. ఫోర్టిఫైడ్ బియ్యం విషయంలో మంత్రి చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: AP: వారికి నెలకు రూ.10 వేలతో పాటు బస్‌ పాస్‌ కూడా ఫ్రీ