P Krishna
Postal Ballet Completed: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం ముగిసింది. అధికార, ప్రతిపక్షనేతలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.
Postal Ballet Completed: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం ముగిసింది. అధికార, ప్రతిపక్షనేతలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.
P Krishna
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ముగియనుంది. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు మధ్య నువ్వా నేనా అన్నచందంగా ప్రచారాలు నిర్వహించారు. ఏపీలో అధికార పార్టీ వైఎస్సాఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ఏపీలో జరబోతున్న ఎన్నికలు ఇరు పార్టీ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లారు. గెలుపు పై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 13న జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం జరగబోయే సార్వత్రిక, పార్లమెంట్ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెల్ పోలింగ్ ముగిసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.3 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్, హూం ఓటింగ్, ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరిలో వచ్చేవారు ముందస్తుగా ఓటు వేశారని ఏపీ ఎన్నికల సంఘటం పేర్కొంది. ఇదిలా ఉంటే.. 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. ముందస్తు ఓటింగ్ 3.5 రెట్లు ఎక్కువగా నమోదు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు.
ముందస్తుగా ఓటు వేసిన వాళ్లలో 1.2 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, 2 లక్షల మంది ఇతర ప్రభుత్వ ఉద్యోగులు.. 40,000 మంది పోలీస్ అధికారులు కాగా హూం ఓటింగ్ వేసిన వారి సంఖ్య 28000, ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరిలో 31000 మంది పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ ని వినియోగించుకున్నట్లు ఏపీ ఎన్నికల సంఘం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సోమవారం 13న జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్క ఓటర్ తప్పకుండా వినియోగించుకోవాలి అని కోరారు.