iDreamPost
android-app
ios-app

దగ్గుబాటి పురంధేశ్వరి ఓ మేక వన్నెపులి: పోసాని

  • Published Nov 07, 2023 | 7:06 PM Updated Updated Nov 07, 2023 | 7:06 PM

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై ప్రముఖ దర్శకుడు, నటుడు ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవుతారనే భయం పురంధేశ్వరిలో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై ప్రముఖ దర్శకుడు, నటుడు ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవుతారనే భయం పురంధేశ్వరిలో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు.

  • Published Nov 07, 2023 | 7:06 PMUpdated Nov 07, 2023 | 7:06 PM
దగ్గుబాటి పురంధేశ్వరి ఓ మేక వన్నెపులి: పోసాని

ఏపీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. ముఖ్యంగా తరచూ కొందరు నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. ప్రభుత్వం, విజయసాయి రెడ్డిపై ఆమె చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆమె బీజేపీలో ఉంటూ టీడీపీకి కోవర్టుగా  పని చేస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా  ప్రముఖ దర్శకుడు, ఏపీ ఎఫ్ డీసీ  ఛైర్మన్ పోసాని కృష్ణమురళి .. దగ్గుబాటి పురంధేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవుతారనే భయం పురంధేశ్వరిలో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు.

మంగళవారం హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై ఫైర్ అయ్యారు. పురంధేశ్వరి ఓ మేక వన్నె పులి అని, ఆమె నిజస్వరూపం తెలిస్తే.. అంతా షాకవుతారని ఆయన అన్నారు. పురంధేశ్వరి ఈ మధ్య సుప్రీం కోర్టు సీజేకి లేఖలు రాశారని, దేశం మీద ఆమెకు ప్రేమ ఎక్కువ ఉందనే అందరూ అనుకోవాలని ఆమె తాపత్రయపడుతున్నారని పోసాని అన్నారు.

అయితే ఆమె ఎలాంటిదో అందరికీ తెలుసని, బాలకృష్ణ ఎలాంటి పనులు చేసినా ఆమె మద్దతు ఇవ్వడం అంతా చూశారని ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణను మానసిక రోగి అని చాలా మంది చెబుతుంటారు. మరి.. ఆయన ఇంకా మానసిక రోగిగానే ఉన్నారా? అనేది పురంధేశ్వరి చెబితే బాగుటుందని పోసాని సెటైర్ వేశారు. ఇక ఆమె బీజేపీలో ఉన్న కూడా చంద్రబాబు కోసమే పని చేస్తున్నారని. ఓటుకు నోటు కేసు భయంతో చంద్రబాబు ఏపీకి పారిపోయాడు. అలాంటి వ్యక్తికి పురంధేశ్వరి మద్దతు ఇస్తున్నారని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమెకు నిజాయితీ, విలువలు రెండూ లేవని, ఆమె అసలు బీజేపీ అధ్యక్షురాలు ఎందుకు అయ్యారని,  ఏనాడైన పార్టీ కోసం పని చేశారా? అని పోసాని నిలదీశారు. ఇదే సందర్భంగా పవన్ కల్యాణ్ పై కూడా పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. ” రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్ చంద్రబాబును తిట్టిన తిట్లు  ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే.. పవన్ అంత ఘోరంగా తిట్టారు. ఇప్పుడు అదే చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకున్నారు” అని పోసాని అన్నారు. బాబుగారు, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యక్తులో కాపు, కమ్మ వాళ్లంతా గుర్తించాలని పోసాని విజ్ఞప్తి చేశారు.

గతంలో చంద్రబాబు అరెస్టు అయిన సందర్భంగాలో లోకేశ్ తో కలిసి పురంధేశ్వరి కేంద్ర హోంమంత్రిని కలిశారు. ఇటీవలే విజయసాయి రెడ్డి బెయిల్ ను తొలగించాలంటూ పురంధేశ్వరి సుప్రీంకోర్టు సీజే కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఏపీ ప్రభుత్వంపై పలు అంశాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది.   ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు పురంధేశ్వరి పై ఫైర్ అవుతున్నారు. ఆమె ప్రజల కోసం కంటే మరిది కోసం ఎక్కువ కష్టపడుతున్నారంటూ వైసీపీ నేతలు అంటున్నారు. మరి.. తాజాగా పురంధేశ్వరిపై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio