ఆ ఎన్నికల్లో పవన్ ను చంద్రబాబు దెబ్బకొట్టాడు : పోసాని

Posani krishna Murali: ప్రముఖ నటుడు, దర్శకుడు, ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి..టీడీపీ అధినేత చంద్రబాబుపై తరచూ ఫైర్ అవుతూ ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకా చంద్రబాబుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Posani krishna Murali: ప్రముఖ నటుడు, దర్శకుడు, ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి..టీడీపీ అధినేత చంద్రబాబుపై తరచూ ఫైర్ అవుతూ ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకా చంద్రబాబుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ చాలా వాడీ వేడిగా ఉంటాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంటుంది. అధికార వైసీపీపై  ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తుంటే.. వారికి ధీటుగా వైసీపీ నేతలుగా కూడా గట్టిగా సమాధానం చెబుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకపడుతుంటారు. మోసం చేయడంలో చంద్రబాబు దిట్టా అని, వెన్నుపోటుకు సరైన ఉదాహరణ బాబు అంటూ కామెంట్స్ చేస్తుంటారు.తాజాగా నటుడు, ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసేది లుచ్చా రాజకీయమని పోసాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రముఖ నటుడు, ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలపై స్పందించారు. ఇదే సమయంలో తెలంగాణలో పవన్ కి పడిన ఓట్లపై కూడా పరోక్షంగా పోసాని స్పందించారు. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు సర్వనాశనం చేస్తారని ఆయన తెలిపారు. తెలంగాణలో పవన్ కల్యాణ్‌కు టీడీపీ ఓట్లేయలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ అభ్యర్థులకు కమ్మ వాళ్లు ఓట్లు  వేయ్యలేదని ఆయన విమర్శించారు.

చంద్రబాబే కమ్మ వాళ్లను జనసేన పార్టీ అభ్యర్థులకు ఓటెయ్యొద్దని చెప్పాడని పోసాని ధ్వజమెత్తారు. ఒక వేళ పవన్‌కి ఎక్కువ ఓట్లు వస్తే.. ఏపీలో ఎక్కువ సీట్లు అడుగుతాడని ఆ విధంగా చేసినట్లు తెలిపారు. అందుకే తెలంగాణలో పవన్ కల్యాణ్‌ ను చంద్రబాబు దెబ్బకొట్టాడని మురళి పేర్కొన్నారు. ఇంతటి మోసం చేసిన చంద్రబాబుకే కాపుల ఓట్లు వేయిస్తానని పవన్ చెప్పడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కాపులను చంపిన చంద్రబాబుకి పవన్ మద్దతిస్తాడా? అని ఆయన పవన్ కల్యాణ్ ని సూటిగా ప్రశ్నించారు.

ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ వంటి మూడు రాష్ట్రాల్లో మోడీ గెలవడంతో చంద్రబాబు వణికిపోతున్నాడని అన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో మద్దతిచ్చి బీఆర్ఎస్‌ని ఓడించాలని బాబు అనుకున్నాడని పోసాని తెలిపారు. అయితే హైదరాబాద్‌లో చంద్రబాబు కారణంగానే కాంగ్రెస్‌కి ఒక్క సీటు రాలేదని దుయ్యబట్టారు. చంద్రబాబుని హైదరాబాద్‌లోని సెటిలర్లంతా ఛీ కొట్టారని అన్నారు. అందుకు నిదర్శనమే హైదాబాద్ లో వచ్చిన ఫలితాలనే అన్నారు.  చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఇద్దరు మళ్లీ మోసం చేయడానికి ఏపీకి వస్తున్నారని,  ఏపీ ప్రజలు అమాయకులు కాదని పోసాని పేర్కొన్నారు.

తెలంగాణలో టీడీపీ ఎవరికి ప్రత్యక్షంగా మద్దుతు ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ కు మాత్రం పరోక్షంగా మద్ధతు ఇచ్చిందని పలువురు నేతలు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణలో జనసేనకు డిపాజిట్లు కూడా రాకుండా పోయాయి. దీనికి కారణం చంద్రబాబే నని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి.. చంద్రబాబుపై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments