iDreamPost
android-app
ios-app

వీడియో: నడిరోడ్డుపై పోలీసుల కొట్లాట! జనం చూస్తున్నారన్న సోయి లేకుండా..

పోలీసులను చూడగానే సెల్యూట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. 24/7 శాంతి భద్రతలను పరిరక్షిస్తూ విధులు నిర్వర్తిస్తుంటారు పోలీసులు. అందుకే వారిపై విపరీతమైన గౌరవం పర్తజలకు .మకు ఏదైనా అన్యాయం జరిగితే.. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తుంటాం. కానీ ఇక్కడ

పోలీసులను చూడగానే సెల్యూట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. 24/7 శాంతి భద్రతలను పరిరక్షిస్తూ విధులు నిర్వర్తిస్తుంటారు పోలీసులు. అందుకే వారిపై విపరీతమైన గౌరవం పర్తజలకు .మకు ఏదైనా అన్యాయం జరిగితే.. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తుంటాం. కానీ ఇక్కడ

వీడియో: నడిరోడ్డుపై పోలీసుల కొట్లాట! జనం చూస్తున్నారన్న సోయి లేకుండా..

‘కనిపించే మూడు సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతీకలైతే ఆ కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ సాయి కుమార్ పవర్ ఫుల్ డైలాగ్ వింటే గూస్ బంప్స్ రావడం ఖాయం. ప్రజలకు భద్రత, రక్షణ కల్పించే పోలీసు వ్యవస్థ పట్ల సామాన్యులకు విపరీతమైన గౌరవం. ఎండ అనక, వాననక, చలి చంపేస్తున్నా కూడా 24/7 విధులు నిర్వర్తిస్తూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా ఆపద వచ్చినా, అన్యాయం జరిగినా ముందుగా ప్రజలు ఆశ్రయించేంది తొలుత పోలీసులనే. ఎంత కష్టమొచ్చినా బాధితులకు అండగా నిలుస్తుంటారు. కానీ కొన్ని సార్లు స్వయంకృతాపరాధం కారణంగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై కొట్టుకోవడం చర్చనీయాంశమైంది.

ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఏపీలో కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై తన్నుకున్నారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీల్లో భాంగా పిల్లిగుండ్లు చెక్ పోస్టులో రొళ్ల, ఆగళి పోలీస్ స్టేషన్లకు చెందిన శివ కుమార్, నారాయణ స్వామి నాయక్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్‌కు విధులు వేశారు. ఈ ఇద్దరే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నడిరోడ్డుపై పిడిగుద్దులు గుద్దుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంతకు వీరిద్దరు ఎందుకు కొట్టుకున్నారంటే.. విధుల విషయంలో. సాయంత్రం డ్యూటీ షిఫ్ట్ ఆలస్యం అయ్యిందనే విషయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి.. పెనుగులాటకు అటు నుండి తన్నుకోవడం వరకు చేరింది. ఖాకీ దుస్తుల్లోనే కుమ్ములాడుకున్నారు.

సహనం కోల్పోయిన ఇద్దరు కానిస్టేబుల్స్.. తాము ఉన్నది బహిరంగ ప్లేస్ అని మర్చిపోయి మరీ దాడి చేసుకున్నారు. స్ట్రీట్ ఫైట్ చేసుకున్నారు. దుర్బాషలాడుతూ.. చొక్కాలు చొక్కాలు పట్టుకుని తన్నుకున్నారు. జనాలు చూస్తున్నారన్న సోయి లేకుండా మరీ తోసుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు ప్రజలు వచ్చినప్పటికీ ఆగలేదు. ఈ మొత్తం దృశ్యాన్ని అక్కడే ఉన్న వ్యక్తి మొబైల్లో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతుంది. విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు.. ఇలా పొట్టు పొట్టుగా తన్నుకోవడంపై కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా గొడవపడితే.. సర్ది చెప్పే పోలీసులు ఇలా గొడపపడటం ఏంటని అంటున్నారు. వీరే ఇలా ప్రవర్తిస్తే.. శాంతి భద్రతల సంగతేంటని చర్చించుకుంటున్నారు.