Arjun Suravaram
నేటితో దేశ వ్యాప్తంగా ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. భారీ సంఖ్యలో పోలీసులు పల్నాడు జిల్లాలోనే పలు ప్రాంతాల్లో మోహరించారు.
నేటితో దేశ వ్యాప్తంగా ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. భారీ సంఖ్యలో పోలీసులు పల్నాడు జిల్లాలోనే పలు ప్రాంతాల్లో మోహరించారు.
Arjun Suravaram
దేశ వ్యాప్తంగా ఎన్నికల సమరం ముగిసింది. నేడు ఏడో విడత పోలింగ్ జరిగింది. దీంతో ఇక అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ వైపు ఉంది. అంతేకాక జూన్ 4వ తేదీన విడుదలయ్యే ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో దేశ ప్రజలు ఏపీ ఎన్నికల ఫలితాలవైపు ఆసక్తిగా చూస్తున్నారు. అందుకు కారణం ఏపీలో పోలింగ్ రోజు జరిగిన పరిణామాలే అందుకు కారణం. ఏపీలో భారీగా పోలింగ్ నమోదు కావడంతో పాటు కొన్ని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాడులు జరిగాయి. నేడు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల కోసం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. భారీగా పోలీసుల బలగాలను పల్నాడు జిల్లాలో దింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జూన్ 13వ తేదీన ఏపీలో మూడో విడతలో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి వంటి ప్రాంతాల్లో పార్టీల మధ్యగొడవలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని పలు నియోజవర్గాల్లో తీవ్రమైన గొడవలు చోటుచేసుకున్నాయి. ప్రత్యర్థులపై దాడులు, వారి వాహనాలను తగలబెట్టడం వంటి ఘటనలు జరిగాయి. అలానే చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ ఎస్పీని మార్చి..మలికా గార్గ్ ను పల్నాడు ఎస్పీగా నియమించారు. దీంతో ఆమె పోలింగ్ రోజు జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకుని ఆమె శాంతిభద్రతల విషయంలో గట్టి చర్యలు తీసుకుంటుంది. సామాన్య ప్రజలకు ఎవరు ఇబ్బందులు కలగు చేసిన ఊరుకునే ప్రసక్తిలేదంటూ ఇప్పటికే ఆమె గట్టి హెచ్చరికలు చేసింది.
ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు పోలీసుల అధికారులకు ఎస్పీ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. నేడు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే పల్నాడు జిల్లాలో భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. ప్రధానంగా పిడుగురాళ్ల, నర్సారావు పేట వంటి ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఎటువంటి గొడవలు జరగకుండా జిల్లా ఎస్పీ గట్టి చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన వారం రోజుల వరకు పల్నాడు జిల్లాలో పలు ఆంక్షలు విధించారు. పోలింగ్ రోజు జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ తీసుకుంటున్న ఈ చర్యలపై ప్రజలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో భారీగా పోలీసులు మోహరించిన దృశ్యా లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ వీడియోను చూసిన పలువురు వివిధ కామెంట్స్ చేస్తున్నారు. ఖాన్సార్ ను తలపిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.