iDreamPost
android-app
ios-app

ఎన్నికల వేళ టీడీపీకి షాక్.. ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు!

TDP MLA: ప్రజలకు సేవ చేయడం ప్రజాప్రతినిధుల విధి. అయితే కొందరు మాత్రం చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడుతూ పాలవుతుంటారు. ఈక్రమంలనే పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుంటారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

TDP MLA: ప్రజలకు సేవ చేయడం ప్రజాప్రతినిధుల విధి. అయితే కొందరు మాత్రం చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడుతూ పాలవుతుంటారు. ఈక్రమంలనే పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుంటారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్నికల వేళ టీడీపీకి షాక్.. ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు!

ప్రజాప్రతినిధులు అంటే  ప్రజలకు సేవ చేస్తూ.. వారికి ఆదర్శంగా ఉండాలి. అలానే ఎన్నికల సందర్భంల్లో కూడా ఎంతో హుందాగా  ఉండి యువతకు మార్గదర్శంగా నిలవాలి. కానీ కొందరు ప్రజాప్రతినిధులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. ఈక్రమంలో వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తుంటారు. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం వివిధ కేసుల్లో జైలుకు వెళ్లారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యేపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎన్నికల అక్రమాలపై పోలీసు శాఖ కొరఢా ఝళిపించింది. మరి.. ఆ ఎమ్మెల్యే ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదైంది. నోవా అగ్రిటెక్ కంపెనీ ద్వారా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చి ఓటర్లకు పంచినట్లు ఇంకొల్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ఎమ్మెల్యే  సాంబశివరావుతో పాటు నోవా  అగ్రిటెక్ ఉద్యోగులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. త్వరలో వారిని విచారణకు పిలుస్తారని తెలుస్తుంది. రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు జనవరి 24న గుంటూరులోని నోవా అగ్రిటెక్‌ కంపెనీలో సోదాలు నిర్వహించారు.

police case on tdp mla

ఈ క్రమంలో కంపెనీలో అక్రమాల జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సోదాల్లో గుర్తించిన అక్రమాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు అనుమతించాలని పోలీసులు పర్చూరులో స్థానిక కోర్టును ఆశ్రయించారు. పోలీసుల అభ్యర్థనలను పరిశీలించిన కోర్టు సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారించేందుకు సోమవారం అనుమతి ఇచ్చింది. దీంతో బాపట్ల జిల్లా ఇంకొల్లు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు నోవా అగ్రిటెక్‌ కంపెనీ ఉద్యోగి పుల్లెల అజయ్‌బాబు, ఆ కంపెనీకి చెందిన మరో ముగ్గురు ఉద్యోగులు, మరికొందరిని నిందితులుగా చేర్చారు.

డీఆర్ఐ నిర్వహించిన సోదాల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి. జనవరి 24 ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహించడంతో ఎమ్మెల్యే పాల్పడ్డ ఎన్నికల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ  ఆఫీస్ లో లభించిన ఓ డైరీలో కీలక విషయాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తెప్పించడం, పర్చూరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించడం, అందుకోసం ఓటుకు రూ. 1000 చొప్పున పంపిణీ చేసిన నగదు వివరాలు అన్నీ పోలింగ్‌ బూత్‌లవారీగా నమోదు చేసి ఉన్నాయి. అయితే వారు ఖర్చు చేసిన నగదు ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే వివరాలు మాత్రం కంపెనీ రికార్డుల్లో లేవు. దీంతో డీఆర్‌ఐ అధికారులు ఈ అంశాన్ని ఆదాయపన్ను శాఖ, ఈడీ , సెబీ ప్రధాన కార్యాలయాలకు నివేదించారు.  అదేవిధంగా ఎన్నికల అక్రమాలపై బాపట్ల పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు రంగంలోకి దిగి.. కోర్టు అనుమతితో టీడీపీ ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.