P Venkatesh
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఓ వైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి ఏపీ సీఐడీ చేత అరెస్టు కాబడిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేనా అధినేత పవన్ కళ్యాన్ బాబుకు మద్దతు తెలిపి రాజమండ్రి జైల్లో ములాఖత్ అయిన తర్వాత రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనా కలిసే పోటీ చేస్తాయని సంచలన ప్రకటన చేశాడు. దీంతో జనసేనా కార్యకర్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. బాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అయిన పవన్ కళ్యాన్ చేసిన ప్రకటన చూసి అందరు నవ్వుకున్నారు. కాగా ఇప్పుడు ఓ సభలో మాట్లాడుతూ టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చి మద్దతిచ్చాను అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాన్ మాట్లాడిన ఆ వీడయోలో.. నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యుండి కూడా.. చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటికి వచ్చి తెలుగు దేశం పార్టీకి 100 శాతం నా మద్దతు తెలిపానంటే.. మీరు టీడీపీ నాయకులు బలహీనంగా ఉన్నప్పుడు, టీడీపీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఓ పర్సెప్షన్ ఉన్నప్పుడు అండగా నిలబడడం కోసమే మద్దతిచ్చానంటూ బాంబ్ పేల్చాడు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలతో టీడీపీ నాయకుల గొంతులో వెలక్కాయ పడ్డట్లైంది. కాగా మరో సందర్భంలో నేను ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాలనుకుంటే చెప్పే చేస్తా దొంగ చాటుగా చేయను అని పవన్ కళ్యాన్ అన్నాడు.
అందుకే మీరు నా తరపున బయటికి వచ్చేశాడని చెప్పాల్సిన అవసరం వైసీపీ నాయకులకు లేదంటూ రెండు నాల్కల ధోరణిలో మాట్లాడాడు. ఓ సారి ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చానంటాడు మరోసారి ఎన్డీఏతో కలిసే ఉన్నానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఊసర వెల్లి మాదిరిగా ఉందంటూ పలువురు విమర్శిస్తున్నారు. మాటమీద నిలకడ లేక పూటకో మాట మార్చుతూ పైగా వైసీపీపై నిందలేసే పవన్ కళ్యాణ్ తీరుపై ప్రజలు చీదరించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తన మాట మీద తానే నిలబడలేక వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంటూ చేసిన కామెంట్లతో ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు.