nagidream
Lorry Electrocuted And Burnt: ఆపద ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. 35 మంది కూలీలతో వెళ్తున్న బొప్పాయి లోడ్ లారీ విద్యుత్ షాక్ కి గురై పూర్తిగా కాలి బూడిదయ్యింది.
Lorry Electrocuted And Burnt: ఆపద ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. 35 మంది కూలీలతో వెళ్తున్న బొప్పాయి లోడ్ లారీ విద్యుత్ షాక్ కి గురై పూర్తిగా కాలి బూడిదయ్యింది.
nagidream
ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో తెలియదు. లారీలు తిరగబడడం, ప్రమాదాలకు గురి కావడం వంటివి జరగడం చూస్తున్నాం. కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు సంభవిస్తాయి. పల్లెటూర్లలో ఎత్తైన లారీలు వెళ్తున్నప్పుడు విద్యుత్ తీగలు తగులుతుంటాయి. లారీలో ఉన్న వ్యక్తులు కర్రలతో ఆ తీగలను పైకి ఎత్తుతారు. అయితే హై వోల్టేజ్ తీగలు తగిలితే మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో రైల్వేకోడూరులో బొప్పాయి లోడ్ తో వెళ్తున్న లారీ విద్యుత్ తీగలు తగిలి పూర్తిగా కాలి బూడిదయ్యింది.
ఈ ఘటనలో ఒక మహిళా కూలీ మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండల పరిసర ప్రాంతాల్లో రైతులు బొప్పాయి సాగు ఎక్కువగా చేస్తారు. పంట చేతికొచ్చిన తర్వాత బొప్పాయి పండ్లను లారీల మీద ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఈ క్రమంలోనే ఒక లారీ బొప్పాయి పండ్లను వేసుకుని ఆ లోడ్ తో బయలుదేరింది. ఆ లారీలో 35 మంది కూలీలు ఉన్నారు. లోడ్ తో వెళ్తుండగా అనంతరాజుపేట వద్ద బొప్పాయి లోడ్ తో వెళ్తున్న లారీకి 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. వెంటనే 35 మంది కూలీలు లారీ మీద నుంచి కిందకు దూకేశారు.
దీంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి లారీ మొత్తం తగలబడింది. లారీ క్యాబిన్, ఛాసిస్ భాగం చెక్కతో తయారై ఉండడం వల్ల మంటలు వేగంగా అంటుకున్నాయి. కాగా ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిరువురినీ తిరుపతి రుయా హాస్పిటల్ కి తరలించారు. మృతి చెందిన మహిళకు భర్త, నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య మృతి పట్ల భర్త కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.