iDreamPost
android-app
ios-app

Palnadu: పల్నాడు జిల్లాలో ఘోరం.. బస్సులో మంటలు.. ఆరుగురు సజీవదహనం

  • Published May 15, 2024 | 8:00 AM Updated Updated May 15, 2024 | 8:00 AM

తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. నిద్రలో ఉన్న ప్రయాణికుల జీవితాలో.. నిద్రలోనే బుగ్గిపాలయ్యాయి. ప్రైవేట్‌ బస్సులో మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఆ వివరాలు..

తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. నిద్రలో ఉన్న ప్రయాణికుల జీవితాలో.. నిద్రలోనే బుగ్గిపాలయ్యాయి. ప్రైవేట్‌ బస్సులో మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఆ వివరాలు..

  • Published May 15, 2024 | 8:00 AMUpdated May 15, 2024 | 8:00 AM
Palnadu: పల్నాడు జిల్లాలో ఘోరం.. బస్సులో మంటలు.. ఆరుగురు సజీవదహనం

వారంతా ఓటు వేయడం కోసం హైదరాబాద్‌ నుంచి సొంత ఊరికి వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక రోజు కుటుంబంతో సంతోషంగా గడిపారు. ఇక ఆ తర్వాత తిరిగి మళ్లీ నగరానికి పయనం అయ్యారు. మంచి నిద్రలో ఉన్నారు. మరి కొన్ని గంటల్లో వారు గమ్యం చేరుకుంటారు. తమ వాళ్లను చూస్తారు అనుకునేలోపు మృత్యువు వచ్చి వారిని పలకరించింది. కొన్ని గంటల్లో ఇంట్లో ఉంటాము అని భావించిన వారి ఆశలు గల్లంతయ్యాయి. బస్సులో మంటలు చెలరేగడంతో.. అగ్ని కీలల్లో ఆహుతయ్యారు. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. 20మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణం ఎక్కడ చోటు చేసుకుంది అంటే..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం అన్నంబొట్లవారిపాలెం-పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు దగ్గర.. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో దారుణం చోటు చేసుకుంది. ఎదురుగా కంకర లోడ్‌తో వచ్చిన టిప్పర్‌ బస్సును ఢీకొట్టింది. వెంటనే టిప్పర్‌కు మంటలు అంటున్నాయి.. అవి బస్సుకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహం కాగా.. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో ఉన్న వారంతా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం.. సొంత ఊర్లకు వెళ్లారు. తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా.. ఈ దారుణం చోటు చేసుకుంది. నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థం అయ్యేలోపే.. ఆరుగురు సజీవదహనం అయ్యారు.

ఇక ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే 108, పోలీసులకు సమాచారం అందిచారు. యాక్సిడెంట్‌ గురించి తెలుసుకున్న వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ వెంటనే చీరాల, యద్దనపూడి, చిలకలూరిపేట, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాయి. ట్రావెల్స్‌ బస్సులో చిక్కుకుపోయిన వారిని జాగ్రత్తగా బయటకు తీశారు.. వారిని 108 వాహనాల్లో గాయపడినవారిని చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్ని సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. బైపాస్‌ పనులు జరుగుతుండటంతో..అక్కడ తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోయి ఉందని స్థానికులు చెబుతున్నారు. టిప్పర్‌ అతి వేగంతో దూసుకురావడంతో టిప్పర్‌ డ్రైవర్ కంట్రోల్ చేయలేక బస్సును ఢీకొట్టినట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.