P Venkatesh
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాల విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ గురువారం విడుదల చేశారు.
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాల విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ గురువారం విడుదల చేశారు.
P Venkatesh
ప్రస్తుతం ఎక్కడ చూసినా పరీక్షాఫలితాల సందడే కనిపిస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ ఫలితాల విడుదలవగా పలువురు విద్యార్థులు సత్తాచాటారు. తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. రాష్ట్రా వ్యాప్తంగా పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం తేలనుంది. ఇక ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో పలువురు విద్యార్థులు ఆల్ టైమ్ రికార్డ్ మార్కలతో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఏకంగా టెన్త్ లో 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అరుదైన ఘనతను సాధించింది విద్యార్థిని. ఏపీలోని విద్యార్థులకు మరో గుడ్ న్యూస్. ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ ఫలితాల విడుదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్ సొసైటీ) పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ గురువారం విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు 32,581 మంది; ఇంటర్ పరీక్షలకు 73,550 మంది చొప్పున విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతిలో 18,185 మంది (55.81శాతం), ఇంటర్‌లో 48,377 మంది (65.77శాతం) ఉత్తీర్ణత సాధించారు. మార్చి 18 నుంచి 26 వరకు ఈ పరీక్షలు జరగిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 29 నుంచి మే 7 వరకు రీ వాల్యుయేషన్ /రీకౌంటింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 10 నుంచి 12 వరకు నిర్వహిస్తామన్నారు. పరీక్ష ఫీజును ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు చెల్లించవచ్చని తెలిపారు.