సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న ఉల్లి ధరలు! ఇదే కారణం…

Onion Prices: ఇప్పటి వరకు సామాన్యుడికి టమాటాలు, ఇతర కూరగాయలు షాక్ ఇవ్వగా..త్వరలో ఉల్లిగడ్డలు కూడా షాకివ్వనున్నాయి. త్వరలో వీటి ధరలు బాగా పెరగనున్నాయి. అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

Onion Prices: ఇప్పటి వరకు సామాన్యుడికి టమాటాలు, ఇతర కూరగాయలు షాక్ ఇవ్వగా..త్వరలో ఉల్లిగడ్డలు కూడా షాకివ్వనున్నాయి. త్వరలో వీటి ధరలు బాగా పెరగనున్నాయి. అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

ప్రస్తుతం సామాన్యుడి జీవనం చాలా కష్టంగా మారింది.  నిత్యవసర వస్తువుల నుంచి..తినే కూరగాయల వరకు అన్నిటి ధరలు బాగా పెరిగాయి. మొన్నటి వరకు టమాటాల ధరలు ఆకాశంవైపు చూశాయి. వాటి కొనలేక సామాన్య ప్రజలు అల్లాడిపోయారు. కొందరు అయితే టామాటలను కొనడమే మానేశారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల నుంచి టమాటా ధరలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. టమాటా రేట్లు తగ్గాయని సంతోషిస్తున్న సమయంలో సామాన్యులకు ఉల్లి షాకిస్తుంది. మరోసారి వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. మరి.. అందుకు కారణం, ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…

ఉల్లి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటున్నాయి. నెల రోజుల కిందట వరకు అందుబాటు ధరలో ఉల్లగడ్డలు వచ్చేవి. ఇప్పుడు కూడా కాస్తా చౌకధరలోనే ఉల్లిగడ్డలు లభిస్తున్నాయి. అయితే ఎవరైనా ఉల్లిగడ్డలు కొనాలని అనుకుంటే..త్వరగా కొనేయండి.  మరికొన్ని రోజుల్లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉల్లిధరలు భారీగా పెరగనున్నాయనే వార్తలు రావడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ఉల్లిపాయల ధర కేజీ రూ.40 నుంచి రూ.60 దాకా ఉంది. ప్రీమియం క్వాలిటీ అయితే.. ఇంకాస్తా ఎక్కువ  ధర పలుకుతోంది. వీటి ధరలు తగ్గాలని ప్రజలు భావిస్తుంటే..పెరిగే విధంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇలా ఉల్లి ధరలు పెరడానికి రెండు కారణాలు ఉన్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల పంటలు దెబ్బతినడమే కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వర్షాల కారణంగా పంట దిగుబడి బాగా తగ్గిందని, మార్కెట్ కి సప్లయ్ కూడా పూర్తి స్థాయిలో రావడం లేదని అంటున్నారు. అలానే ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు ఉల్లిపాయల దిగుమతి బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం కర్నూలు మర్కెట్ లో క్వింటాల్ ఉల్లిధర రూ.3700 ఉంది. అంటే కేజీ రూ.37గా పలుకుతుంది. దిగుమతి తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరిగి త్వరలోనే వీటి ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

సాధారాణంగా టమాటాలు, కొత్తిమీర వంటివి కూరగాయల ధరలు పెరిగితే.. తిరిగి తగ్గేందుకు నెల నుంచి రెండు నెలలపడుతుంది. ఎందుకంటే.. ఆ సమయంలో ఆ పంటలు చేతికి వస్తాయి. ఉల్లిగడ్డల విషయంలో మాత్రం అలా ఉండదు. ఒకసారి ఉల్లి పంట వేస్తే, దిగుబడి రావడానికి ఏకంగా 100 నుంచి 150 రోజులు పడుతుంది. అందువల్ల ఉల్లి ధరలు పెరిగితే, వెంటనే తగ్గవు. ఈ కారణంతోనే ఉల్లిధరల పెరుగుతాయనే వార్త సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Show comments