అచ్యుతాపురం ఘటన.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన!

Atchutapuram Sez Accident: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల పలు కెమికల్, ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న అచ్యుతాపురంలోని ఫార్మ కంపెనీలో రియాక్టర్ పేలి భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది.

Atchutapuram Sez Accident: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల పలు కెమికల్, ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న అచ్యుతాపురంలోని ఫార్మ కంపెనీలో రియాక్టర్ పేలి భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది.

ఇటీవలె బాణా సంచా, కెమికల్ ఫ్యాక్టరీ, ఫార్మా కంపెనీల్లో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. యాజమాన్యం సరైన రక్షణ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు అప్పటికప్పుడు హడావుడి చేయడం.. తర్వాత షరా మాములుగానే సాగుతుంది. ఏపీలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్‌(స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌)లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోగా.. 60 మందికి పైగా కార్మికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం..  ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం ప్రకటించింది.

విశాఖ జిల్లా కలెక్టర్ ఈ ఎక్స్ గ్రేషియా వివరాలను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు కలెక్టర్ హరిందర్ ప్రసాద్ తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు కూడా పరిహారం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. గాయాల తీవ్రతను బట్టి ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని అన్నారు.  గాయపడ్డ వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మ కంపెనీలో భారీ పేలుడు సంభవించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతి చెందిన, గాయపడ్డ వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల నష్టపరిహారం అందిస్తామని పీఎంఓ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రకటించింది.  ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటన జరగడానికి గల కారణాలపై దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. రియాక్టర్‌ పేలడం వల్ల కాదని.. సాల్వంట్ లీకేజ్ జరగడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఏదైనా ఉంటే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరి బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments