Arjun Suravaram
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ఐదేళ్లలో అనేక సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. తాజాగా ఈ అంశాలపై ఓ కాంటెస్ట్ జరగనుంది. ఆసక్తిగలవారు ఇందులో పాల్గొన్ని..విజేతగా నిలిస్తే.. భారీగా నగదను బహుమతిగా పొందవచ్చు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ఐదేళ్లలో అనేక సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. తాజాగా ఈ అంశాలపై ఓ కాంటెస్ట్ జరగనుంది. ఆసక్తిగలవారు ఇందులో పాల్గొన్ని..విజేతగా నిలిస్తే.. భారీగా నగదను బహుమతిగా పొందవచ్చు..
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతి లేని సంక్షేమ పాలన అందించడమే తన ధ్యేయంగా పెట్టుకుని… ఈ ఐదేళ్ల పాటు ఆ విధంగానే కృషి చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారి ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చారు. నవరత్నాల పేరుతో పేదలకు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించారు. ఇదే సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు. మొత్తంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పాలనలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఈ అంశాలు పక్కన పెడితే.. సీఎం జగన్ సంక్షేమ అంశాలపై ఓ కాంటెస్ట్ జరుగనుంది. ఇందులో రూ.25 లక్షలు నగద బహుమతి కూడా ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
2019 జూన్ లో ఏపీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు. అదే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలతో ఐదేళ్లు పాలించారు. తాజాగా ఈ అంశాలపై పోటీలు నిర్వహించనున్నారు. సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా ‘మేము సైతం’ పేరుతో ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోటీని నిర్వహించనున్నారు.
ఔత్సాహిక ప్రవాసాంధ్రులు ఈ కాంటెస్టను ఏర్పాటు చేశారు. శరత్ ఎత్తపు, తిరుమల్ రెడ్డి అనే ఎన్నారైలు ఈ ఆన్ లైన్ కాంటెస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ పోటీని ఏపీ ఎన్ఆర్టీసీ చైర్మన్ వెంకట్ మేడపాటి ప్రారంభించారు. సీఎం జగన్ పాలనలో లబ్ధిదారులు పొందిన లబ్ధి గురించి అభిప్రాయాన్ని వీడియో రూపంలో చేసి అందరికీ తెలియజేయడమే ఈ ప్రోగామ్ ముఖ్య ఉద్దేశమని నిర్వహాకలు తెలిపారు. https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టరై, వీడియోలను షేర్ చేయాలని తెలిపారు.
మీ ఫోన్ ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాన్ని వీడియో తీయండి, ఈ పోటీకి సంబంధించిన ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇదే సమయంలో అలా వచ్చిన వీడియోలను పరిశీలించి.. బెస్ట్ వీడియోకు గుర్తింపుతో పాటు నగదు పురస్కారం అందిస్తారు. బెస్ట్ వీడియోకు తగిన గుర్తింపుతోపాటు నగదు పురస్కారం ఉంటుంది. https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టర్ అయి, వీడియోలను షేర్ చేయాల్సి ఉంటుంది.
ఆసక్తి ఉన్న వారు “మేము సైతం” కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లి జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాష్ బహుమతులు గెలవచ్చని నిర్వహాకులు తెలిపారు. ఈ పోటీలో వచ్చిన వీడియోలను అనుభవజ్ఞులైన బృందం పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుంది. ఈ కాంటెస్ట్ మొత్తం రూ.25 లక్షల నగదు బహుమతులు ఉన్నాయని నిర్వహాకలు తెలిపారు. ప్రతి కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి రూ. 25,000, ద్వితియ బహుమతి కింద రూ.15,000, తృతియ బహుమతి కింద రూ.10,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. అలానే జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.5 వేలు, రెండో బహుమతి కింద రూ.3 వేలు, మూడో బహుమతి కింద రూ.2 వేలు ఇవ్వనున్నట్లు శరత్ చెప్పారు. మరి.. ఆసక్తిగల వారు.. ఈ పోటీలో పాల్గొన్ని భారీ ప్రైజ్ మనీ గెల్చుకోవచ్చు.