nagidream
Vande Bharat Train Now Halts At That Station: తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే వందే భారత్ రైలు మధ్యలో ఆరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. అయితే ఇప్పుడు మరొక ఊరిలో ఆగేలా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ ఊరి ప్రయాణికులకు మేలు చేకూరనుంది.
Vande Bharat Train Now Halts At That Station: తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే వందే భారత్ రైలు మధ్యలో ఆరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. అయితే ఇప్పుడు మరొక ఊరిలో ఆగేలా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ ఊరి ప్రయాణికులకు మేలు చేకూరనుంది.
nagidream
ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే భారీ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి నడిచే వందే భారత్ రైలు కేవలం పరిమిత స్టేషన్స్ లో మాత్రమే ఆగుతుంది. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, విశాఖపట్నం జంక్షన్ స్టేషన్స్ వద్ద ఆగుతుంది. అయితే ఇప్పుడు ఈ హాల్ట్ స్టేషన్స్ జాబితాలో మరో స్టేషన్ ని చేర్చింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలు ఏలూరులో కూడా ఆగేలా స్టాప్ ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ ప్రకటన చేశారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో నడిచే వందే భారత్ రైలు ఇక ఆగస్టు 25 నుంచి ఏలూరులో కూడా ఆగుతుందని ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-బెంగళూరు మార్గాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణికుల అవసరాలు తీరుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మార్గంలో నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. విజయవాడ, రాజమండ్రి మధ్యలో ఎక్కడా కూడా ఆగడం లేదు. ఈ రెండు స్టేషన్స్ మధ్యలో స్టాప్ అనేదే లేదు. దీంతో ఈ మధ్యలో దిగే ప్రయాణికులు అయితే రాజమండ్రిలో గానీ, లేదా విజయవాడలో గానీ దిగే పరిస్థితి వస్తుంది. దీని వల్ల ప్రయాణ భారం, ఖర్చులు పడుతున్నాయి.
త్వరగా వెళదామని వందే భారత్ రైలు ఎక్కినా గానీ తాము దిగాల్సిన ఊరికి దూరంగా దిగాల్సి వస్తుండడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ, రాజమండ్రి స్టేషన్స్ మధ్య ఏలూరు స్టేషన్ ని కూడా చేర్చింది. ఇక నుంచి వందే భారత్ రైలు ఏలూరు స్టేషన్ లో కూడా ఆగనుంది. దీంతో విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల మధ్యలో దిగాలనుకునే ప్రయాణికులకు.. ముఖ్యంగా ఏలూరు ప్రయాణికులకు శుభవార్త చెప్పినట్లయింది. కాగా దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆగస్టు 25 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది.
20707 నంబర్ తో వందే భారత్ రైలు గురువారం తప్పించి మిగతా ఆరు రోజులు సికింద్రాబాద్ లో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ మధ్యలో ఆరు స్టేషన్స్ లో ఈ రైలు ఆగేది. వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్స్ లో ఆగేది. ఇప్పుడు ఈ హాల్ట్ స్టేషన్స్ జాబితాలో ఏలూరు కూడా చేరింది. ఈ రైలు ఉదయం 9.49 గంటలకు ఏలూరు చేరుకొని.. 9.50కి మళ్ళీ బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఇదే రైలు 20708 నంబర్ తో విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.54 గంటలకు ఏలూరుకి చేరుకుంటుంది. అక్కడ నుంచి సాయంత్రం 5.55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.