రోజాపై నోరు పారేసుకున్న దక్కని ఫలితం..జనసేన కోసం బండారు బలి?

Bandaru Satyanarayana Murthy: మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి గురించి రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో మంత్రి ఆర్కే రోజాపై  గురించి ఓ వార్త పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది.

Bandaru Satyanarayana Murthy: మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి గురించి రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో మంత్రి ఆర్కే రోజాపై  గురించి ఓ వార్త పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది.

రాజకీయాల్లో నిలబడేందుకు నేతలు అనేక వ్యూహాలు రచిస్తుంటారు. చాలా మంది ప్రజలకు సేవలు చేస్తూ..పొలిటికల్ గా స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారికే అధిష్టానం కూడా టికెట్లు కేటాయిస్తుంది. కానీ మరో వర్గం..కేవలం అధిష్టానం వద్ద మెప్పు కోసం.. ప్రత్యర్థి పార్టీల నేతలను తిట్టడం, దూషించడం పనిగా పెట్టుకుంటారు. అయితే అది కూడా ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ మరికొందరు నేతలు మరీ దిగజారుడుగా ప్రవర్తిస్తూ.. మహిళ ఎమ్మెల్యేలు, మంత్రులు అనే చూడకుండా ఇష్టానుసారం దూషిస్తుంటారు. తమ అధిష్టానం నుంచి ఏదో ఆశించి.. అలా చేసిన చాలా మంది నేతలకు భంగపాటు తప్పలేదు. ఆకోవాలనే ఓ మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తోంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన గురించి ఓ వార్త  పోలిటికల్ సర్కిల్ లో వైరల్ అవుతోంది.

మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి గురించి రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో మంత్రి ఆర్కే రోజాపై  గురించి ఓ వార్త పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి గురించి రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో మంత్రి ఆర్కే రోజాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై పెద్దదుమారమే రేగింది. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బండారు వ్యాఖ్యలపై సీరియస్ అయ్యింది. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసమే బండారు సత్యనారాయణ మూర్తి ఆ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వినిపించాయి.

  బండారు సత్యనారాయణమూర్తి ఎంపీ రామ్మోహన్ నాయుడు మామ గారు అన్న విషయం తెలిసింది. ఇన్ని సమీకరణ నేపథ్యంలనో ఆయన కూడా 2024 ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ ఇస్తుందని భావించారు. కట్ చేస్తే.. తాజాగా జనసేన కోసం బండారు బలి కానున్నారని తెలుస్తోంది. బండారుకు విశాఖ జిల్లాలోని పెందుర్తి టికెట్ రాదని ప్రచారం సాగుతోంది. బండారు సత్యనారాయణ  పెందుర్తి సీటుని ఆశిస్తున్నారని, దాని కోసమే ఆయన చాలా కాలంగా పని చేస్తుకుంటూ వస్తున్నారు. 2009లో పెందుర్తి నియోజకవర్గం ఏర్పడితే అప్పుడు పోటి చేసిన బండారు ఓడిపోయారు. తిరిగి 2014లో టీడీపీ తరపున అదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో మళ్లీ ఓటమి ఆయనను పలకరించింది.

ఇక 2024లో తనకు టికెట్ ఇస్తే ఈసారి ఎన్నికలలతో రాజకీయానికి ముగింపు పలకాని ఆయన చూస్తున్నారు.  అయితే దాని కంటే ముందే జనసేనతో టీడీపీ పొత్తు కారణంగా బండారు సీటుకు ఎసరు వచ్చేలా పెందుర్తిలో సీన్ కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నా. ఇటీవలే వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. పెందుర్తి సీటు హామీగా ఇవ్వడంతోనే జనసేనలో చేరారని తెలుస్తోంది. ఇప్పుడు పొత్తుల వేళ మరో మరో మారు అదే ప్రచారం సాగుతోంది. పంచకర్ల  రమేష్ బాబుకు పెందుర్తి టికెట్ ఇస్తే బండారుని సముదాయించే పక్కన పెడతారని అంటున్నారు. ఈ క్రమంలోనే బండారును జనసేన కోసం బలి కానున్నారనే వార్తలు వినిపిసోతన్నాయి.

2014లో కూడా బండారు ఎమ్మెల్యే అయ్యాక మంత్రి పదవిని ఆశించారు. కానీ అది దక్కకపోవడంతో అప్పట్లో బాబు మీద ఆయన అలిగిన సందర్భాలు ఉన్నాయి. మంత్రి పదవి అటుఉంచి ఇప్పుడు పూర్తిగా సీటుకే ఎసరు వస్తోంది. తాను ఈ సారి గెలిచి..తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయలాని చూస్తున్న ఈ సీనియర్ నేతకు టీడీపీ, జనసేన  పొత్తు వల్ల షాక్ తప్పేట్లు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి..పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోన్న వార్తపై పూర్తి విషయాలు తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి ఉండాలి. మరి.. బండారుపై పొటిలికల్ సర్కిల్ లో వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments