Arjun Suravaram
Nellore Rottela Festival: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, మతసామరస్యానికి వేదికగా నిలుస్తున్న నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈక్రమంలోనే ఈ పండగ వెనుక ఉన్న చరిత్ర ఏమిటనేది ఇప్పుడు చూద్దాం..
Nellore Rottela Festival: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, మతసామరస్యానికి వేదికగా నిలుస్తున్న నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈక్రమంలోనే ఈ పండగ వెనుక ఉన్న చరిత్ర ఏమిటనేది ఇప్పుడు చూద్దాం..
Arjun Suravaram
భారతదేశం సువిశాలమైంది. విభిన్న ప్రాంతాలు, ప్రజలు, సంప్రదాయాలు, సంస్కృతులతో మిళితమైంది. అలానే వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పండుకలు, జాతరలు, తిరునాళ్లలు నిర్వహిస్తుంటారు. కొన్ని పండగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి నెల్లూరు జిల్లాలో జరుపుకునే రొట్టేల పండగ. మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే పండుగా..ఈ రొట్టేల పండగు పేరుంది. నేడు ప్రారంభమైన ఈ వేడుక..ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఇక అసలు ఈ పండగ జరుపుకోవడానికి గల కారణం ఏంది.. అసలు రొట్టెల పండగ వెనుక ఉన్న పూర్తి చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
స్థానికులు, కొన్ని చరిత్రల్లో రాసిన ప్రకారం… పూర్వం నెల్లూరు ప్రాంతాన్ని ఆర్కాటు అనే నవాబులు పాలించే వారు. ఇక వీరి పరిపాలన కాలంలో జరిగిన ఓ సంఘటనే ఈ రొట్టెల పండగకు పునాది వేసింది. ఆర్కాటు నవాబుల పాలనలో నెల్లూరు చెరువు వద్ద రజకులైన ఇద్దరు దంపతులు బట్టలు ఉతికి జీవనం సాగిస్తుండే వారు. అలానే ఓసారి బట్టలు ఉతికేందుకు వెళ్లిన ఆ దంపతులు బాగా ఆలస్యం కావడంతో ఆ చెరువు వద్దనే ఆగిపోయారు. ఆ రాత్రి అంతా ఆ భార్యాభర్తలు చెరువు వద్దనే నిద్రపోయారు. రజకుని భార్యకు ఆ ప్రాంతలోనే సమాధులైన బారాషహీద్‌లు కలలోకి వచ్చారు. ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, సమాధుల ప్రక్కనున్న మట్టిని తీసుకెళ్ళి ఆమె నుదిటిపై రాస్తే ఆరోగ్యం బాగుపడుదుందని చెప్పారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ రజక దంపతులిద్దరు గ్రామంలోకి వెళ్తున్నారు.
అదే సమయంలో ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమెకు సరైన వైద్యం చికిత్స అందించిన వారికి భారీగా బహుమతులు ఉంటాయని దండోరా వేయిస్తుంటారు. వెంటనే రజకుడు తన భార్యకు కలలో వచ్చిన విషయాన్ని ఆర్కాట్ నవాబు ఆస్ధానంలో ఉన్న వారికి తెలియజేస్తాడు. దీంతో అతడి మాటలకు తొలుత నవాబు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ తరువాత తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపిన నవాబు.. అక్కడి మట్టిని తెప్పించుకుని ఆయన భార్య నుదుటిపై రాస్తారు. దీంతో వెంటనే ఆమె అనారోగ్యం నుంచి కొలుకుకుంటుంది. దీంతో ఆ నవాబు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలసి ఆ చెరువు సమీపంలో ఉన్న సమాధుల వద్దకు వచ్చి బారాషహీదులకు ప్రార్థనలు చేశారు. అంతేకాక తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నింటిని అక్కడి వారికి ప్రసాదంగా పంచారు. ఇక అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ ఆనవాయితీ ప్రకారం రొట్టెల జరుగుతోంది.
కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇస్తుంటారు. అదే విధంగా కోర్కెలు కోరుకునే వారు కూడా వాటిని తీసుకుంటారు. అలా రొట్టెలు మార్పు చేసుకోవడంతో రొట్టెల పండుగగా మారింది. అప్పట్లో ఈ పండుగను మొహరం నెలలోఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు. ఈ పండగను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా రొట్టెల పండుగా బుధవారం ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు ఘనంగా జరగనుంది. భక్తులు భారీగా వస్తారనే అంచనాతో అన్ని ఏర్పాట్లును రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లీంలు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా దగ్గర రొట్టెల పండుగను ఘనంగా నిర్వహిస్తారు.