Arjun Suravaram
Nara Lokesh: యువగళం పాదయాత్ర తరువాత నారా లోకేశ్ మరో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శంఖారావం పేరుతో శ్రీకాకుళం జిల్లాలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆదివారం జరిగిన లోకేశ్ మూడు సభలు అభాసుపాలయ్యాయి.
Nara Lokesh: యువగళం పాదయాత్ర తరువాత నారా లోకేశ్ మరో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శంఖారావం పేరుతో శ్రీకాకుళం జిల్లాలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆదివారం జరిగిన లోకేశ్ మూడు సభలు అభాసుపాలయ్యాయి.
Arjun Suravaram
రాజకీయాల్లోకి వారసులు రావడం సర్వసాధారణం. అయితే కుటుంబం అనేది పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చేందుకు కేవలం ఒక ప్లాట్ ఫామ్ మాత్రమే. తరువాత ప్రజాధరణ పొందడం కోసం మాత్రం యువ నాయకులే కృషి చేయాలి. అంతేకాక తమదైన మాటలతో, రాజకీయ కార్యక్రమాలతో ప్రజల ఆదరణ పొందాలి. అలా చేయడం కొందరు విజయం సాధించగా, మరికొందరు మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంటారు. మరో కేటగిరి వారు కూడా ఉంటారు. తాము ఎంత విఫలం అవుతున్నా.. వారి కుటుంబం రాజకీయంగా బలంగా ఉండటంతో జాకీలు పెట్టుకుని మరీ పైకి లేచేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి జాబితాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్ ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.
మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజకీయం గురించి అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆయన ప్రసంగాలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి అందరికి తెలిసిందే. అలానే ఆయన నిర్వహించే సభలో, ఇతర కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన కూడా అంతంత మాత్రమే ఉంటుంది. అందుకు ఉదాహరణే గతంలో నిర్వహించిన యువగళం యాత్ర, ఇతర సభలు. ఆ సమయంలో లోకేశ్ కోసం జనాలను సమీకరించేందుకు స్థానిక నేతలు నానాతంటాలు పడ్డారు. అయినా కూడా ఆ సభలు, లోకేశ్ ప్రసంగం విమర్శల మూటకట్టుకుంది. ఆదివారం నుంచి శంఖారావం పేరుతో మరో కార్యక్రమానికి నారా లోకేశ్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సురంగి రాజావారి మైదానంలో శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈ సభలో ఖాళీ కుర్చీలు, ప్రసంగంలో సంకారావాలు, ఆయన చేసే విమర్శల్లో కనిపించని ఆధారాలు, కలగలిపి లోకేశ్ శంఖారావం తొలిరోజే అభాసుపాలైంది. లోకేశ్ ప్రసంగిస్తున్నప్పుడు జనం లేచి వెళ్లిపోవడంతో ఖాళీల కుర్చీలు దర్శనం ఇచ్చాయి. అనంతరం పలాసలో నిర్వహించిన సభలోనూ అదే సీన్ రీపిట్ అయ్యింది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్పల రాజుపై అనేక నిరాధరమైన ఆరోపణలు చేశారు. ఇక లోకేశ్ నిర్వహించిన సభ కోసం స్థానిక నేతలు జనాలను సమీకరించేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. మద్యం, మనీ ఇచ్చినా కూడా సభకు వచ్చేందుకు స్థానికులు ఆసక్తి చూపించలేదు.
ఇక్కడ కార్యకర్తలకు పెట్రోల్ కూపన్లు పంచడం విశేషం. అలాగే స్టేజీ ముందు నాయకులు, భద్రతా సిబ్బంది దెబ్బలాడుకున్నారని సమాచారం. ఇక్కడ టెక్కలిలో జరిగిన సభలో ఆద్యంతం రెడ్ బుక్ ను చూపిస్తూ లోకేశ్ ప్రసంగించారు. ఇక తమ కార్యకర్తలను సమన్వయంగా ఉండమని చెప్పేది పోయి.. వారిని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అత్యధికంగా కేసులు నమోదు చేసుకున్న టీడీపీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ ఆఫర్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. టెక్కలి సభలో పెద్దగా జనం లేకపోవడంతో లోకేశ్ అసంతృప్తి చెందారని తెలుస్తోంది.
ఇక్కడ సుమారు 5 గంటల సమయంలో సభ వద్దకు వచ్చినప్పటికీ కార్యకర్తలు పెద్దగా లేకపోవడంతో 6 గంటల వరకు సభను ప్రారంభించలేదు. ఇక ఈ మూడు సభల్లో కార్యకర్తలకు బహిరంగంగానే రూ.500, రెండు క్వార్టర్ బాటిళ్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా మూడు సభల్లో ఖాళీ కుర్చీలు, ప్రసంగాల్లో సంకారావాలు, విమర్శల్లో కనిపించని ఆధారాలు కలగలిపి మొదటి రోజే లోకేశ్ శంఖారావం అభాసుపాలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. శంఖారావం సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం దేనికి సంకేతం?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.