iDreamPost
android-app
ios-app

నేను, మా నాన్న పోరాటయోధులం! ఇంత హీట్ లోనూ లోకేశ్ కామెడీ!

నేను, మా నాన్న పోరాటయోధులం! ఇంత హీట్ లోనూ లోకేశ్ కామెడీ!

స్కిల్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిని తాడేపల్లికి తరలించి సిట్ అధికారులు విచారించి రిమాండ్ రిపోర్టు ను రికార్డ్ చేశారు. ఆ తర్వాత బాబును ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బాబు తరఫున వాదనలు వినిపించేందుకు ఏకంగా సుప్రీంకోర్టు లాయర్ ను అపాయింట్ చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్న వోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న కోర్టు చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో బాబును అధికారులు రాజమండ్రి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ప్రజాధనాన్ని లూటీ చేసి అవినీతికి పాల్పడిన బాబు పుత్ర రత్నం నారా లోకేష్ ప్రగల్భాలు పలుకుతున్న తీరు హాస్యం తెప్పించే విధంగా ఉంది. లోకేష్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు.

స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోయి నేను ఏ తప్పు చేయలేదని బాబు అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఒక వేళ నిజంగానే తప్పు చేయకపోయుంటే చట్టానికి లోబడి న్యాయపరంగా నిరూపించుకోవాలి. అలా కాకుండా మసిపూసి మారేడు కాయ చేసినట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి వ్యూహాలు రచించడమేంటి? 14 ఏళ్లపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన ఈ విధమైన అవినీతకి పాల్పడడంతో ప్రజలు చీదరించుకుంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం, బాధ్యాతాయుతమైన పదవులను అనుభవించిన బాబు ప్రజలకు ఏ విధమైన పాలనను అందించాడో ఈ ఒక్క స్కిల్ స్కామ్ కేసుతో అర్థం చేసుకోవచ్చు.

నిజంగానే స్కిల్ స్కామ్ కేసులో తన పాత్ర లేదని బాబు అనుకుంటే కోర్టులో ఆదారాలు చూపించి నిజాయితీగా బయటకు రావచ్చు కదా? ఎంత సేపు నేను తప్పు చేయలేదు అని అంటున్నాడే తప్పా.. చట్టం ముందు నిర్దోషిగా నిరూపించుకుంటానని ప్రజలకు చెప్పలేక పోతున్నాడంటూ రాజకీయ విశ్లేషకులతో పాటు జనాలు కూడా గొల్లున నవ్వుకుంటున్నారు. ఇక నారా లోకేష్ తన తండ్రి గురించి చెప్పే మాటలు జబర్ధస్త్ కామెడీని మించిపోయాయి. నేను, మానాన్న పోరాటయోధులం అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. చేయని తప్పుకు నా తండ్రిని అరెస్టు చేశారు, నా రక్తం మరుగుతోంది.. అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో సింపథీ కొట్టేయడానికి చేసినవే అని పలువురు చర్చించుకుంటున్నారు.

ప్రజలు తనతో కలిసి రావాలని, తమకు అండగా నిలవాలని కోరుతున్న తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వాస్తవానికి బాబు హయాంలో ప్రజల కోసం పనిచేసుంటే, ఏవిధమైన అవకతవకలకు పాల్పడకపోయుంటే నేడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు కూడా తాజా వ్యవహారంపై చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. బాబు అరెస్టు అయితే మాకేంటని ఎవరి పనిలో నిమగ్నమైపోయారు. దీంతో లోకేష్ తీవ్ర నిరాశకు, అసహనానికి గురై ఇలా మత్రిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రజలు చర్చింకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి