Arjun Suravaram
Nara Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడు 'రా కదలి రా' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలానే సోమవారం కూడా రాజమండ్రిలోని కాతేరులో ఈ సభను నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.
Nara Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడు 'రా కదలి రా' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలానే సోమవారం కూడా రాజమండ్రిలోని కాతేరులో ఈ సభను నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తృటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రి లోని కాతేరులో నిర్వహించిన రా..కదలి రా సభలో చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోయారు. రాజానగరం టికెట్ ను జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బొడ్డు వెంకట రమణ వర్గీయులు స్టేజిపై ఆందోళన చేశారు. అనంతరం స్టేజిపై నుంచి కార్యకర్తలు ఒక్కసారిగా కిందకు దూకడంతో చంద్రబాబు పడబోయారు. ఇదే సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై.. చంద్రబాబును పడిపోకుండా పట్టుకున్నారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కార్యకర్తల తీరుపై చంద్రబు అసహనం వ్యక్తం చేశారు.
జనసేన,టీడీపీ మధ్య పొత్తు పొడవడం కష్టంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న వివాదాలు, ఘటనలో ఇందుకు కారణం. ఇప్పటి వరకు కార్యకర్తలు, నేతల మధ్య మాత్రమే లోలోపల యుద్ధం జరిగింది. తాజాగా రాజమండ్రి సభలో ఏకంగా టీడీపీ అధినేత ముందు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో స్థానిక టీడీపీ కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనానికి గురయ్యారు.
మరికొద్ది నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘రా.. కదలి రా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ సభలకు జనాలు లేక అల్లాడిపోతుంటే.. మరోవైపు పొత్తుల గొడవలు తలనొప్పిగా మారాయనే టాక్ వినిపిస్తోంది. ఆదివారం నెల్లూరు, కర్నూలు జిల్లాలోని పత్తికొండలో జరిగిన చంద్రబాబుకు సభ అట్టర్ ప్లాప్ అయింది. ఆశించిన స్థాయిలో జనాలు లేకపోవడంతో చంద్రబాబు స్థానిక నేతల పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం రాజమండ్రిలోని కాతేరులో ‘రా..కదలి రా..” సభను నిర్వహించారు. ఇక సమావేశంలో చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది.
ఇటీవల రాజానగరం టికెట్ ను జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే. దానిపై ఆ నియోజవర్గ టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ వర్గీయుల చంద్రబాబు ముందు ఆందోళన చేశారు. ఇక కార్యకర్తలు స్టేజిపై నుంచి కిందకు దూకుడుగా దిగడంతో చంద్రబాబు పడబోయారు. వెంటనే అప్రమత్తమైన ఆయన సిబ్బంది..పడిపోకుండా పట్టుకున్నారు. ఇక సొంత పార్టీ కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్..రాజోలు, రాజానగరం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నిరసన కార్యక్రమం జరిగింది. రెండు సీట్లకే ఇలా ఉంటే.. ఇక అన్ని సీట్లపై కార్లిటి వచ్చాక.. ఈ రచ్చ మరో స్థాయిలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.