ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొటదిసారిగా విశాఖలోని రెండు ఆసుపత్రులకు ఎన్ఏబీహెచ్ అక్రిడియేషన్ లభించింది. గవర్నమెంట్ మెంటల్ కేర్ హాస్పిటల్(జీఎంసీహెచ్), గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ ఛెస్ట్ డిసీజెస్ ఆసుపత్రులకు నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎన్ఏబీహెచ్) అక్రిడేషన్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య విభాగంలో తీసుకొచ్చిన సంస్కరణలతోనే గుర్తింపు లభించింది. సీఎంగా అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలను మార్చేశారు. ఆ ఫలితమే నేడు ఎన్ఏబీహెచ్ అక్రిడియేషన్ లభించడం.
క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లోని ఒక విభాగమే ఎన్ఏబీహెచ్. ఇది దేశంలోని ఆసుపత్రులు, హెల్త్ కేర్ సెంటర్స్, రక్తదాన కేంద్రాలు, ఆయుష్ ఆసుపత్రులు, వివిధ స్థాయిల్లో పనిచేసే హెల్త్ కేర్ యూనిట్లకు నాణ్యతా ప్రమాణాలను బట్టి గుర్తింపు ఇవ్వడానికి ఏర్పాటు చేయబడింది. సుమారు 10 చాప్టర్లు, 100 ప్రమాణాలు కలిగిన ఈ విభాగం 503 లక్ష్యాలతో పనిచేస్తుంది. ఈ అక్రిడేషన్ కోసం ఆసుపత్రులు.. ఎన్ఏబీహెచ్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటాయి. కేంద్రం ఇచ్చిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే అంశాన్నిఆ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు.
ఆసుపత్రులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కి అనుగుణంగా ఉన్నట్టు నిర్ధారించిన తర్వాత, వాటికి అక్రిడియేషన్ మంజూరు చేయడం జరుగుతుంది. ఈ అక్రిడియేషన్ కాలపరిమితి మూడేళ్లు ఉంటుంది. సీఎం జగన్ ప్రజలకు ఆరోగ్య సేవలను అత్యుత్తమ ప్రమాణాలతో అందించాలని పలుమార్లు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ హెల్త్ మిషన్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలను, ఆసుపత్రుల్లో ప్రమాణాలు ఉండేలా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 537 ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రులు NQAS ప్రమాణాలను అందుకున్నాయి.
2023-24 సంవత్సరానికి 2,956 కేంద్రాలను ఈ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. 2022-23 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ధృవీకరించబడిన జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు (ఎన్ క్యూఏఎస్) 2041ఆరోగ్యం కేంద్రాలు సాధించాయి. అయితే, ఇందులో 452 ఆరోగ్యకేంద్రాలు ఏపీలోనే ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా NQAS ప్రమాణాలు సాధించిన ఆరోగ్యకేంద్రాల్లో 18శాతం ఏపీలోనే ఉన్నాయి. మరి.. వైద్య రంగలో ఏపీ ప్రభుత్వం సాధిస్తున్న ఈ ప్రగతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ట్రైబల్ యూనివర్సిటీ గిరిపుత్రల జీవితాలను మారుస్తుంది: సీఎం జగన్