iDreamPost
android-app
ios-app

పంట సాగుదారుల హక్కు చట్టం భేష్! ఏపీ సర్కార్ కి నాబార్డ్ కితాబు..

NABARD: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అంతేకాక రైతుల కోసం అనేక పథకాలను, చట్టాలను రూపొందించారు. అందుకే సీఎం జగన్ పాలనపై ఇతర రాష్ట్రాల నుంచి, వివిధ సంస్థల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

NABARD: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అంతేకాక రైతుల కోసం అనేక పథకాలను, చట్టాలను రూపొందించారు. అందుకే సీఎం జగన్ పాలనపై ఇతర రాష్ట్రాల నుంచి, వివిధ సంస్థల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

పంట సాగుదారుల హక్కు చట్టం భేష్! ఏపీ సర్కార్ కి నాబార్డ్ కితాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయరంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వైఎస్సార్ రైతు భరోసా, రైతుభీమా, ఆర్బీకే కేంద్రాలు వంటివి ప్రారంభించారు.  వీటి ద్వారా రైతులకు ఆర్థిక భరోసా, నాణ్యమైన విత్తనాలు, మద్దతు ధర లభించడం వంటివి జరుగుతున్నాయి. అలానే జగనన్న శాశ్వత భూ హక్కు పథకం , పంటల సాగుదారుల హక్కు చట్టం అనేవి తీసుకొచ్చి మెరుగైన ఫలితాలను సాధించారు. తాజాగా ఏపీలో పర్యటించిన నాబార్ట్ సంస్థ ఉన్నతాధికారులు జగన్ సర్కార్ తీసుకొచ్చిన పంటసాగు హక్కుదారుల చట్టం-2019 బాగుందని కితాబు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో నాబార్డు మేనేజర్లు బెంజమిన్ థామస్, అరవింద్ కుమార్, నాబార్డు  కన్సల్టెంట్ ప్రణవ్ ఖ్యాతిల సార్థ్యంలోని ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనకు శ్రీకారం  చుట్టింది. తొలి రోజు గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి భూ యజమానులు,  కౌలు రైతులతో ముఖాముఖిలో నిర్వహించారు. వారితో మాట్లాడి చట్టం అమలు తీరుపై అధ్యయం చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన  పంటసాగు హక్కుదారుల యాక్ట్-2019 బాగుందని నాబార్డు  బృందం కితాబిచ్చింది. భూ యజమాని హక్కులకు ఏలాంటి నష్టం వాటిల్లకుండా, వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు హక్కుల పరిరక్షణకు ఈ చట్టం దోహదడతోందని ఈ బృందం పేర్కొంది. భూ యజమాని అనుమతితో పంటసాగు హక్కు పత్రాలు జారీ చేసి కౌలుదారులకు పంట రుణాలతో పాటు, ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అమలు చేస్తుండం హర్షణీయమైన తెలిపారు.

ఇక ఈ పర్యటనలో సీసీఆర్సీ కార్డుల జారీ, రుణాలతో పాటు సంక్షేమ ఫలాల  అమల్లో ఎదురయ్యే సమస్యలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు.  ఈ యాక్ట  కారణంగా తమకెన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అయితే అంగీకార పత్రాలపై సంతకాలు చేయడానికి  భూ యజమానులు ఆలోచిస్తున్నారని కౌలు రైతులు నాబార్డు బృందం దృష్టికి తెచ్చారు.  సీసీఆర్సీ కార్డులుున్న వారికి పంట రుణాల మంజూరులో కొంతమంది బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.  ఇదే సమయంలో భూ యాజమానులు కూడా కొన్ని సందేహాలను నాబార్డ్ దృష్టికి తీసుకెళ్లారు. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తే.. భవిష్యత్ లో లేనిపోని భూ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆదోంళన తమకుందని వారు తెలిపారు.

సీసీఆర్సీ చట్టం రూపకల్పన చాలా బాగుందంటూ నాబార్డు బృందం సభ్యులు ప్రశంసించారు. చట్టాన్ని  ఎంతో పగడ్బందీగా అమలు చేస్తే మెజార్టీ కౌలు రైతులకు మేలు జరుగుతుందని వారు తెలిపారు. సీసీఆర్సీ చట్టంపై  కౌలు రైతులతో పాటు  భూ యజమానులకూ అర్థమయ్యే రీతిలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే రీతిలో కౌలుదారులు ఎక్కువ సంఖ్యలో ఉండే ఇతర రాష్ట్రాల్లోనూ ప్రత్యేక చట్టాలు తీసుకొస్తే మంచి ఫలితాలోస్తాయని నాబార్డు బృందం అభిప్రాయపడింది. మరి.. ఏపీ ప్రభుత్వంపై సీసీఆర్సీ చట్టం విషయంలో నాబార్డు ప్రశంసలు కురిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.