iDreamPost
android-app
ios-app

పార్టీకి రాజీనామా అంటూ వార్తలు.. ఎమ్మెల్యే క్లారిటీ!

  • Published Dec 12, 2023 | 10:50 AMUpdated Dec 12, 2023 | 10:50 AM

ఈ మద్య సోషల్ మీడియాలో ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటారు.. ముఖ్యంగా రాజకీయ నేతలు, సెలబ్రెటీలకు సంబంధించిన పాజిటీవ్, నెగిటీవ్ వార్తలు నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

ఈ మద్య సోషల్ మీడియాలో ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటారు.. ముఖ్యంగా రాజకీయ నేతలు, సెలబ్రెటీలకు సంబంధించిన పాజిటీవ్, నెగిటీవ్ వార్తలు నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

  • Published Dec 12, 2023 | 10:50 AMUpdated Dec 12, 2023 | 10:50 AM
పార్టీకి రాజీనామా అంటూ వార్తలు.. ఎమ్మెల్యే క్లారిటీ!

ఏపీలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ నేపథ్యంలోనే రాజకీయ సమీకరణలు మొదలైనట్లు తెలుస్తుంది. నిన్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ కి రాజీనామా లేఖ పంపారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను సమర్పించారు. అంతేకాదు శాసన సభ కార్యదర్శికి తన రాజీనామా లేఖను స్వయంగా అందజేశారు. అయితే ఎందుకు రాజీనామా చేస్తున్నారన్న విషయంపై ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామాలు ఏపీలో ఒక్కసారే హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే.. ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు నెట్టింట వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వెంటనే సదరు ఎమ్మెల్యే స్పందించి.. రాజీనామాపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే..?   వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ చార్జ్ తిప్పల దేవన్ రెడ్డిలు రాజీనామా చేయడంతో ఒక్కసారే కలకలం రేగింది. మొన్నటి వరకు సీఎం జగన్ కోసం దేనికైనా సిద్దమే అంటూ వచ్చిన నేతలు ఒక్కసారిగా తమ పదవులకు రాజీనామా ఇచ్చి ఫ్లేట్ ఫిరాయించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే అధికార పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారని ఏపీలో వార్తలు సంచలనంగా మారాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సైతం ఆళ్ళ రామకృష్ణారెడ్డి బాటలో నడుస్తున్నారని.. త్వరలో రాజీనామా చేస్తున్నట్లు నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కి మరో రెండు నెలల వ్యవధి ఉండగానే రాజీనామాల పర్వం మొదలు కావండపై ఏపీలో చర్చలకు దారి తీసింది.

mla clarity on his resigning

సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్లపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఖండించారు. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో మిగతా వారిని కూడా అదే లీస్ట్ లో జమచేయడం రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ ఈ విషయంలో మాత్రం తన స్టాండ్ ఒక్కటే.. ఎప్పటికీ వైసీపీ. సోమవారం ఇబ్రహీంపట్నంలో లంక భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వసంత కృష్ణ ప్రసాద్.. మాట్లాడుతూ.. కొంతమంది కావాలనే తనపై పనికట్టుకొని మరీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఏపీ అభివృద్ది కోసం అహర్శిశలు పాటుపడుతున్నారు.. ఆయన వెంట ఉంటూ మేము మా బాధ్యతలు నెరవేస్తునాం. గిట్టని వాళ్లు ఎన్ని చెప్పినా.. సీఎం జగన్ ని ఎన్నటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. నా పై వస్తున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు, ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి