iDreamPost
android-app
ios-app

బ్రోకర్ గాళ్లకు సమాధానం చెప్పను..చిన్నికి కేశినేని నాని కౌంటర్!

Kesineni Nani: ఇటీవల కాలంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీపై, ఆ పార్టీల నేతలపై తీవ్ర స్థాయిలో విరుచకుపడుతున్నారు. అంతేకాక నారా లోకేశ్ కి, చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంటారు. తాజాగా కేశినేని చిన్ని మాటలకు నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Kesineni Nani: ఇటీవల కాలంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీపై, ఆ పార్టీల నేతలపై తీవ్ర స్థాయిలో విరుచకుపడుతున్నారు. అంతేకాక నారా లోకేశ్ కి, చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంటారు. తాజాగా కేశినేని చిన్ని మాటలకు నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బ్రోకర్ గాళ్లకు సమాధానం చెప్పను..చిన్నికి కేశినేని నాని కౌంటర్!

ప్రస్తుతం ఏపీ రాజకీయల్లో చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా జరుగుతోన్న పొటిలికల్ వార్ అయితే మరోస్థాయిలో ఉంది. ఎంపీ కేశినేని నాని వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇక టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేని నాని చాలా దూకుడుగా ఉన్నారు. తనపై వ్యాఖ్యలు చేసే టీడీపీ నేతలు ధీటుగా నాని కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలకు కూడా  నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో లోకేశ్, కేశినేని చిన్నిలకు కేశినేని నాని ఫైర్ అయ్యారు. తాజాగా ఓ మీడియా చిన్ని గురించి ప్రస్తావించగా.. అలాంటి వ్యక్తులకు సమాధాన చెప్పాల్సిన అవసరం లేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల  రూపాయలతో  చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో  కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో మీడియా మాట్లాడారు. ఇదే సమయంలో మీడియా కేశినేని నాని ముందు కొన్ని ప్రశ్నలు ఉంచింది. 60శాతం టీడీపీ ఖాళీ చేస్తామన్నారని, నలుగురు కూడా ఆయన వెంట వెళ్లలేదని కేశినేని చిన్ని అన్నారని మీడియా నాని ముందు ప్రస్తావించింది. కొంతమందిని పట్టించుకోకపోవడం మంచిందని, బ్రోతల్ హౌస్ ను నడిపే వారిని, కోతలు కోసేవారిని, చీటర్ల గురించి నాతో మాట్లాడించ వద్దని నాని పరోక్షంగా చిన్నికి  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  ఎన్నికల అనంతరం బాక్స్ ఓపెన్ చేసిన తరువాత ఎవరు ఖాళీ అయ్యారో అందరికీ తెలుస్తుందని ఆయన తెలిపారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని, తనతో ఉన్న అనుచరులను రమ్మని పిలవలేదని ఆయన తెలిపారు. ఇక ప్రజలు సీఎం జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని కేశినేని నాని తెలిపారు.

ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం తన అనుచరులతో సమావేశం నిర్వహించి తర్వాతే వైఎస్సార్ సీపీలో చేరాలని అనుకున్నాని నాని స్పష్టం చేశారు. అయితే సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైసీపీలో చేరినట్లు ఆయన వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని అప్పుడు చెప్పాను, ఇప్పుడూ చెబుతున్నానని నాని అన్నారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబు, లోకేశ్ లపై కూడా కేశినేని నాని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి  ఒక్కటేనని, ఇక స్థాయిలో లోకేశ్ తన కంటే చాలా తక్కువని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి లోకేశ్ అని, ఆయనెంతే ఆయన స్థాయి ఎంతా అంటూ నాని ఫైర్ అయ్యారు. పెండ్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని నానితో పాటు స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మరి.. చిన్నిపై ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.