iDreamPost
android-app
ios-app

లోక్ సభ దాడి నిందితులను పట్టుకున్న వైసీపీ MP గోరంట్ల మాధవ్!

Gorantla Madhav: వైఎస్సాఆర్ సీపీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పోలీసు డిపార్ట్మెంట్ లో డేరింగ్ విధులు నిర్వహించి.. ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా పార్లమెంట్ ఘటనలో ఆగంతకులను ధైర్యంగా పట్టుకుని మరోసారి వార్తల్లో నిలిచారు.

Gorantla Madhav: వైఎస్సాఆర్ సీపీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పోలీసు డిపార్ట్మెంట్ లో డేరింగ్ విధులు నిర్వహించి.. ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా పార్లమెంట్ ఘటనలో ఆగంతకులను ధైర్యంగా పట్టుకుని మరోసారి వార్తల్లో నిలిచారు.

లోక్ సభ దాడి నిందితులను పట్టుకున్న వైసీపీ MP గోరంట్ల మాధవ్!

బుధవారం లోక్ సభలోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతేకాక పార్లమెంట్ భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు యువకులు లోక్ సభలోని సందర్శకుల గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు.  ఈ క్రమంలోనే టియర్ గ్యాస్ ను అంగతకులు ప్రయోగించారు. అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. అలా నిందితులను వైఎస్సాఆర్సీ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ లోక్ సభలోకి దూసుకెళ్లిన అంగతకుడిని పట్టుకున్నారు. ఎంతో ధైర్యంగా ఆగంతకుడికి ఎదురుగా వెళ్లి ఎంపీ పట్టుకున్నారు. గతంలో గోరంట్ల మాధవ్ పోలీసుగా పని చేసిన విషయం తెలిసిందే. ఆయన  గతంలో అనంతపురం జిల్లాలో సీఐగా పని చేశారు.  ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. 2019లోజరిగిన ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే పోలీస్ శాఖలో మాధవ్ కి ఉన్న అనుభవం ఇక్కడ ఉపయోగ పడింది. పోలీసులు శాఖలో ఉన్న అనుభవంతో అంగతకుడిని వైఎస్సాఆర్ సీపీ ఎంపీ మాధవ్ పట్టుకున్నారు. దీంతో ఆయనపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ ఘటనపై ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కీలక విషయాలను తెలియజేశారు.  ఆగంతుకుడు స్పీకర్  ఛైర్ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశాడని తెలిపారు. అదే సమయంలోనే తాను గమనించి.. ఎదురుగా వెళ్లి పట్టుకున్నట్లు ఎంపీ తెలిపారు. సందర్శకుల గ్యాలరీ ఎత్తు తగ్గించడం వల్లే దుండగలు  సులభంగా లోపలికి ప్రవేశించారని మాధవ్ తెలిపారు. సందర్శకుల గ్యాలరీకి గ్లాస్ బిగించాలని ఆయన సూచించారు. ఇది కచ్చితంగా తీవ్రమైన భద్రత వైఫల్యమే అని గోరంట్ల మాధవ్ అన్నారు. మరి.. లోక్ సభ దాడి నిందితులను పట్టుకున్న వైసీపీ MP గోరంట్ల మాధవ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియేయండి.