iDreamPost
android-app
ios-app

ఈ మేక ధర.. రూ. 1.5లక్ష? ప్రత్యేకతలు ఏంటంటే..

మాసం, ఉన్ని కోసం వినియోగించే వాటిలో ప్రధానమైనవి గొర్రెలు, మేకలు. సాధారణంగా వీటి ధర 20 వేల వరకు ఉంటుంది. కానీ ఓ మేక మాత్రం ఏకంగా లక్షన్నర ధర పలికింది. మరి.. మేకలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మాసం, ఉన్ని కోసం వినియోగించే వాటిలో ప్రధానమైనవి గొర్రెలు, మేకలు. సాధారణంగా వీటి ధర 20 వేల వరకు ఉంటుంది. కానీ ఓ మేక మాత్రం ఏకంగా లక్షన్నర ధర పలికింది. మరి.. మేకలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మేక ధర.. రూ. 1.5లక్ష? ప్రత్యేకతలు ఏంటంటే..

ప్రస్తుతం మాంసం తినే వారి సంఖ్యంగా బాగా పెరిగింది. అందుకే మేక, పొట్టేలకు మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. కొందరు వాటి పెంపకాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇవే కేవలం మాంసం కోసమే కాకుండా ఉన్ని దుస్తులకు తయారీ కోసం కూడా పెంచుతుంటారు. మాములుగా మన దేశావాళీ మేక ఖరీదు మహా అయితే  ఇరవై వేలు ఉంటుంది. ఇంకా గరిష్టంగా అంటే రూ.30 వేల వరకు ఉంటుంది. కానీ ఓ మేక ఖరీదు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ మేక ధర ఏకంగా ఒకటిన్నర లక్షలు ఉంది. మరి.. ఆ మేక ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసకుందాం..

ఒళ్లంతా విపరీతంగా పెరిగిపోయిన  ఊలుతో కనిపిస్తున్న ఈ మేక చిగు జాతికి చెందినది. ఈ మేకలు హిమలయ పర్వత ప్రదేశాల్లో  యూపీకి ఉత్తరంగా, హిమాచల్ ప్రదేశ్ కు ఈశాన్యంగా ఎక్కువగా లభిస్తుంటాయి. ఎక్కువగా తెలుపు రంగులో వంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములు తిరిగి ఉంటుంది. ఇక దీని బరువు సుమారు 50 కేజీలు ఉంటుంది. హిమాలయాల్లో చలి ఎక్కువగా ఉండటంతో వీటి శరీరంపై ఊలు చాలా పొడవుగా పెరుగుతుంది.

వీటి ద్వారా సేకరించిన ఊలుతో శాలువాలు, స్వెటర్లు తయారు  చేస్తుంటారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన అడబాల వెంకటేశ్వరావు దీనిని కొనుగోలు చేశాడు. వెంకటేశ్వర్ రావుకు పశు పోషణ అంటే చాలా ఇష్టం.  వివిధ ప్రాంతాల్లో లభించే ప్రత్యేకమైన ఆవులు, గిత్తలు, విభిన్నంగా ఉండే మేకలు, చెవుల పిల్లలు వంటి వాటిని పెంచుతూ కొన్నాళ్ల తరువాత విక్రయిస్తుంటారు. అలానే వెంకటేశ్వర్ రావు చిగు జాతికి చెందిన మేకను నేపాల్ లో రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు.

మాచవరంలో జరిగిన పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గాలి  గోపురం, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాలకు పుంగనూరు ఆవు, దూడను, తీసుకొచ్చారు. వీటితో పాటు ఆయన ఈ చిగు జాతి మేకను కూడా అక్కడకు తీసుకువచ్చారు. వింతగా కనిపిస్తున్న ఈ మేకను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. భయంకరమైన చలి నుంచి.. ఈ మేక ఉన్నితో చేసిన దుస్తులు రక్షణ కలిపిస్తాయంట. వీటికి ఉత్తర భారత దేశంలో చాలా డిమాండ్ ఉందంట. ప్రస్తుతం ఈ మేక ధర.. కేవ్వు కేక అంటూ స్థానికులు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఒటిన్నర లక్షల భారీ ధర పలికిన ఈ మేకపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.