AP Model School Admissions: AP మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం.. వివరాలు ఇవే!

AP మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం.. వివరాలు ఇవే!

AP Model School Admissions: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులకు నోటిఫికేషన్ వెలువడింది. 2024-25 విద్యా సంవత్సరానికి  ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ ప్రకటన వెలువడింది.

AP Model School Admissions: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులకు నోటిఫికేషన్ వెలువడింది. 2024-25 విద్యా సంవత్సరానికి  ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ ప్రకటన వెలువడింది.

ఆంధ్రప్రదేశ్ లోని మోడల్ స్కూల్స్ లో 2024-25 విద్యా సంవత్సరానికి  ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా 162 మోడల్  స్కూల్స్ లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. పదో తరగతి లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇక ఈ మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాల దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఏపీలో ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పదో తరగతి పాసైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.  2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మోడల్స్ స్కూళ్లల్లో ఇంటర్ ఫస్టియర్ వారికి మాత్రమే ఈ ప్రవేశాలు ఉంటాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన వారే  ఈ దరఖాస్తు అర్హులు. అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. మార్చి 28వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానుంది. మార్చి 28న ప్రారంభంగా మే 22వ తేదీని ఈ ప్రక్రియ ముగియనుంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ వివరాలను అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.

ఇక మోడల్స్ స్కూల్స్ లో ఇంటర్ ప్రవేశాల గురించి ముఖ్య వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏపీలోని 164  ఆదర్శ పాఠశాల్లో ప్రవేశాల ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో అడ్మిషన్లు ఇస్తారు. ఇక దరఖాస్తు చేసుకునే వారు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి.  అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తులు 2024 మార్చి 28 నుంచి 2024 మే 22 వరకు స్వీకరించ బడతాయి. అనంతరం ప్రవేశాల ఎంపిక విధానం అనేది పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల ఆధారంగా ఉంటుంది. ఆ రూల్స్ ప్రకారమే తుది జాబితాను ప్రకటిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్   https://apms.apcfss.in/  లో చూడండి.

Show comments