iDreamPost
android-app
ios-app

Nandamuri Balakrishana: కార్యకర్తపై చెయ్యి చేసుకున్నఎమ్మెల్యే బాలకృష్ణ!

  • Published Apr 13, 2024 | 12:02 PM Updated Updated Apr 13, 2024 | 12:02 PM

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తరచూ అభిమానులపై చేయ్యి చేసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వెళ్లిన బాలకృష్ణ మరోసారి కార్యకర్తపై చెయ్యి చేసుకున్నారు.

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తరచూ అభిమానులపై చేయ్యి చేసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వెళ్లిన బాలకృష్ణ మరోసారి కార్యకర్తపై చెయ్యి చేసుకున్నారు.

  • Published Apr 13, 2024 | 12:02 PMUpdated Apr 13, 2024 | 12:02 PM
Nandamuri Balakrishana: కార్యకర్తపై చెయ్యి చేసుకున్నఎమ్మెల్యే బాలకృష్ణ!

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపు అందుకుంది. సమ్మర్ హీట్ మించి ఏపీలో పొలిటికల్ హీట్ నడుస్తోంది. అధికార వైఎస్సార్ సీపీ,  ప్రతిపక్ష కూటమి పార్టీలైన జనసేన, టీడీపీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల అధినేతలు ప్రచారాలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ పొలిటికల్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఇదే సమయంలో మరోసారి కార్యకర్తపై చెయ్యి చేసుకున్ని వార్తల్లో నిలిచారు.

టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ..తన అభిమానులపై, కార్యకర్తలపై తరచూ  ఏదో ఒక సందర్భంలో చేయి చేసుకున్న ఘటనలు మనం చూశాం. ఏదైనా  కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. శనివారం నుంచి హిందూపురంలో బాలకృష్ణ రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇక ఎన్నికల ప్రచారం మొదలుపెట్టక ముందే బాలకృష్ణ.. తన శైలిలో దబ్బిడి దిబ్బిడి షురూ చేసేశారు. సహనం కోల్పోయి ఓ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు.

శనివారం నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ బస్సుయాత్రకు సిద్ధమయ్యారు. ఈ యాత్ర ద్వారా హిందూపురంలో ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నేందుకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో కదిరికి ఆయన చేరుకున్నారు. ఆయన అక్కడ ల్యాండ్‌ కాగానే అభిమానులు, కార్యకర్తలు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త బాలకృష్ణతో సెల్ఫీ కోసం యత్నించాడు. దీంతో ఎప్పటిలాగానే  బాలయ్య సహనం కోల్పోయి… ఆ కార్యకర్తపై చెయ్యి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా సదరు వ్యక్తిపై ఆగ్రహం ప్రదర్శించారు. పక్కనే ఉన్న నేతలు సైతం ఆ కార్యకర్తను దూరంగా నెట్టేశారు. గతంలోనూ పలు సందర్భాల్లో బాలకృష్ణ అభిమానులపై చేయ్యి చేసుకున్నారు.  గతంలో ఓ సారి హిందూపురంలోనే ఓ అభిమాని చెంప చెల్లుమనిపించారు బాల కృష్ణ. హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమసయంలో  ఆఘటన చోటుచేసుకుంది.

ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థిని ఇంటికి వెళ్లారు బాలయ్య. ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడుతుండగా… అభిమాని వీడియో తీశాడు. దీనిని గమనించిన బాలయ్య.. ఆ అభిమాని చెంప చెల్లుమనిపించారు. ఇలా తరచూ తనదైన దబ్బిడ దిబ్బిడి శైలీలో అభిమానులపై దెబ్బల వర్షం కురిపిస్తారనే పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఎంతో అభిమానంతో చూడటానికి వచ్చిన వారిపై అలా చేయ్యి చేసుకోవడం ఏంటని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మరోసారి కార్యకర్తపై చేయ్యి చేసుకుని బాలయ్య వార్తల్లో నిలిచారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet