iDreamPost
android-app
ios-app

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు. కాన్వాయ్ ఆపి సాయం చేసిన మంత్రి వనిత

  • Published Mar 02, 2024 | 10:42 AM Updated Updated Mar 02, 2024 | 10:42 AM

Home Minister Vanita is a Humanitarian: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్లున్న మంత్రి వనిత వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలు రక్షించారు.

Home Minister Vanita is a Humanitarian: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్లున్న మంత్రి వనిత వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలు రక్షించారు.

  • Published Mar 02, 2024 | 10:42 AMUpdated Mar 02, 2024 | 10:42 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు. కాన్వాయ్ ఆపి సాయం చేసిన మంత్రి వనిత

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. డ్రైవర్లు చేస్తున్న పొరపాటు వల్ల ఎంతోమంది బలవుతున్నారు. నిర్లక్ష్యం, అతి వేగం, అనుభవం లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదాలు సంభవించిన సమయంలో అటుగా వెళ్తున్న రాజకీయ నేతలు వెంటనే స్పందించి బాధితులను తమ కాన్వాయ్ లో హాస్పిటల్ కి తరలిస్తున్నారు. అలాంటి ఘటనే ఏపిలో చోటు చేసుకుంది. గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న ఓ యువకుడిని హూంమంత్రి తానేటి వనిత రక్షించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీ హూం మంత్రి తానేటి వనిత మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం ఆమె తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గౌరిపట్నం వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో దుద్దుకూరు సమీపంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడి ఉన్నాడు. అది గమనించిన మంత్రి వనిత వెంటనే తన కాన్వాయ్ పక్కకు ఆపించారు. గాయపడ్డ వ్యక్తి గురించి ఆరా తీసి వెంటనే అతనికి సాయం అందించాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. బాధితుడికి కంగారు పడాల్సిన పనిలేదని, మెరుగైన చికిత్స అందుతుందని ధైర్యం చెప్పారు. అంతేకాదు తన కాన్వాయ్ లో గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చికిత్స అందిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని కోరారు.

గాయపడ్డ వ్యక్తి వద్దకు సెక్యూరిటీ పోలీసులు రావడంతో ఒకింత భయాందోళనకు గురయ్యాడు.. వెంటనే మంత్రి వనిత అతని వద్దకు వెళ్లి భయపడాల్సిన అవసరం లేదని.. వీళ్లు నిన్నురక్షించడానికి వచ్చారని ధైర్యం చెప్పారు. బాధితుడిని లింగాల వెంకట్రావుగా గుర్తించారు. దుద్దుకూరు కు చెందిన ఓ క్వారిలీ అతడు కార్మికుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో అన్న విషయం తెలియాల్సి ఉంది. ఎంత బిజీగా ఉన్నా.. తన పని పక్కన పెట్టి ప్రమాదంలో ఉన్న ఓ బాధితుడి ప్రాణాలు రక్షించిన హూంమంత్రి తానేటి వనిత మానవత్వానికి ప్రజలు అభినందనలు చెబుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు వాళ్లను పట్టించుకొని రక్షణ కల్పించేవాళ్లే నిజమైన నాయకులు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.