iDreamPost
android-app
ios-app

బండారు అసభ్య వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీరు.. సీరియస్ వార్నింగ్!

బండారు అసభ్య వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీరు.. సీరియస్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి రోజా బండారు సత్యనారాయణ మూర్తి తనపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై కన్నీరు పెట్టుకున్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ బండారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బండారు సత్యనారాయణ మూర్తి మంత్రి రోజాపై మీడియా ముఖంగా అసభ్యకరంగా, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై మహిళా లోకం భగ్గుమన్నది. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బండారు వ్యాఖ్యలపై సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే పలువురు బండారుపై ఫిర్యాదు చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి రోజా తన ఆవేదనను వెల్లడించింది.

మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీలో పార్టీలో ఉన్నప్పుడు మంచిదాన్ని గోల్డెన్ లెగ్ ని, పార్టీ నుంచి బయటికి వస్తే ఐరన్ లెగ్ ని అంటూ టార్చర్ పెడుతూ హింసిస్తున్నారు. జగన్ అన్న ఆశీస్సులతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు మంత్రినయ్యాను. ఇది ఓర్వలేక నాపై అక్కసు వెల్లగక్కుతున్నారు. మహిళల్ని ఛీప్ గా చూసే ధోరణి టీడీపీ నాయకులకు పెట్టింది పేరు. మహిళల్ని వేధించడం, మహిళలు కనిపిస్తే ముద్దులు పెట్టండి, కడుపు చేయండంటూ మాట్లాడే మీ టీడీపీ నాయకులను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారు. బండారు మాట్లాడిన తీరు ఆయన తల్లిదండ్రులు తల వంచుకునేలా చేసింది. బండారు చేసిన వ్యాఖ్యలకు ఆయన భార్య అప్పుడే చెప్పుతో కొట్టుంటే ఇలా కించపరిచేలా మాట్లాడే వాడు కాదు.

బండారుని అరెస్టు చేస్తే రాష్ర్ట మహిళలు స్వాగతిస్తున్నారు. సుప్రీం కోర్టే ఆర్డర్ ఇచ్చింది మహిళలు తమకు ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చని.. మీరెవరూ నన్నూ ప్రశ్నించడానికి.. మీకు ఆ హక్కు ఎవరిచ్చారు. ఏ తప్పు చేయకుండా కుటుంబం కోసం, ప్రజల కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నాను. మీకు రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆర్ కాదా. మరి అలాంటి వ్యక్తికి ద్రోహం చేసిన వారికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రశ్నిస్తే క్యారెక్టర్ ను బ్యాడ్ చేసి మాట్లాడుతారా. దుమ్మెత్తి పోయాలంటే అది నీ కళ్లల్లోనే పడుతోంది లోకేష్. బాలక్రిష్ణ కూతురైతే అబద్దాలు చెప్పొచ్చా. టీడీపీ మహిళల్ని ఆట వస్తువులుగా చూస్తోంది. జగన్ ను తిడితే మేం చూస్తూ ఉండాలా. మహిళా పక్షపాతిగా, జనరంజకమైన పాలనతో ముఖ్యమంత్రిగా జగన్ దూసుకెళ్తుంటే ఓర్వలేక విమర్శిస్తున్నారు. టీడీపీ తెలుగు దండుపాల్యం పార్టీలా మారింది. మీరు నా గొంతు నొక్కాలంటే మీ వల్ల కాదు. ఎవ్వరినీ వదిలి పెట్టను ఎంత దూరమైన వెళ్తా.. న్యాయ పోరాటం చేస్తాను’. అని మంత్రి రోజా హెచ్చరించారు.