iDreamPost
android-app
ios-app

AP నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌..!

  • Published Jul 12, 2023 | 12:56 PM Updated Updated Jul 12, 2023 | 12:56 PM
  • Published Jul 12, 2023 | 12:56 PMUpdated Jul 12, 2023 | 12:56 PM
AP నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌..!

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏసీ సర్కార్‌ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. టీచర్‌ కొలువుల కోసం ఎన్నో ఏళ్లుగా ప్రిపేరవుతూ.. నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి బొత్స సత్యనారాయణ శుభవార్త చెప్పారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫైల్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వద్ద ఉందని.. దీనిపై సీఎం కసరత్తు చేస్తున్నారంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం (జులై 11) ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో టీచర్‌ కొలువుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విషయంపై సీఎం జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి బొత్స తెలిపారు. అంతేకాక ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించామని, త్వరలో బదిలీలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. టీచర్ల బదిలీలకు సంబంధించి పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కూడా పరిశీలిస్తున్నామని.. సీఎం జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారని ఈ సందర్భంగా బొత్స ప్రకటించారు. .

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు మంత్రి బొత్స. ఇదే అంశాన్ని ఒప్పంద అధ్యాపకులకు తెలిపామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తామని స్పష్టం చేశారు బొత్స. మరోవైపు రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి కూడా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుంత అధికారులు ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న లెక్కలను తీసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. మొత్తం 12 శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు సమాచారం.