ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కసరత్తులు మెుదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే గురువారం జోనల్ వ్యవస్థ ఏర్పాటు, ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో కాంట్రక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై, జోనల్ వ్యవస్థపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలియజేశారు. ఇందుకు సంబంధించిన జీవోను ఆగస్టు 7న తీసుకొస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
జోనల్ వ్యవస్థ ఏర్పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై గురువారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటు కు సంబంధించిన కసరత్తు తుది దశలో ఉందని బొత్స తెలిపారు. అలాగే త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడతామని తెలిపారు. వీటితో పాటుగా రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కటాఫ్ డేట్ మార్చే విషయంపై అధికారులతో కలిసి ఆలోచన చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఆగస్టు 7న జీవో ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి: వాలంటీర్లకు శుభవార్త చెప్పిన CM జగన్! జీతాలపై కీలక నిర్ణయం..