ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబుకి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి అంబటి ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై లారీలో నుంచి జారి రెండు గోధుమ బస్తాలు పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబుకి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి అంబటి ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై లారీలో నుంచి జారి రెండు గోధుమ బస్తాలు పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబుకి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి అంబటి ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై లారీలో నుంచి జారి రెండు గోధుమ బస్తాలు పడ్డాయి. దీంతో అప్రమత్తమైన కాన్వాయ్ డ్రైవర్.. సడెన్ బ్రేక్ వేయడంతో.. పెను ప్రమాదం తప్పింది. అంబటి అశ్వారావుపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంత్రి సురక్షింగా బయటపడ్డారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి అంబటి రాంబాబు తన కాన్వాయ్ లో అశ్వరావుపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్నారు. ఇదే సమయంలో నాందేడ్ నుంచి విశాఖపట్నానికి గోధుమ బస్తాల లోడుతో ఓ లారీ వెళ్తోంది. కాగా.. సత్తుపల్లి శివారులోని హోండా షోరూం దగ్గర ఎదురుగా కర్రల లోడుతో వస్తున్న వాహనంలోని కర్రలు గోధుమ బస్తాలకు తగిలాయి. దీంతో తాళ్లు తెగి.. రెండు బస్తాలు మంత్రి అంబటి ప్రయాణించే కాన్వాయ్ బానెట్ పై పడ్డాయి. ఇది గమనించిన డ్రైవర్ అప్రమత్తమై.. సడెన్ బ్రేక్ వేయడంతో.. ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మంత్రి పీఏ సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో.. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరో కారులో అంబటి వెళ్లిపోయారు.