iDreamPost
android-app
ios-app

వేప చెట్టు నుండి ధారలా పాలు.. దేవుడి మహిమే అంటూ

ఓ గ్రామంలో పొద్దున్న లేచి చూసే సరికి ఓ వేప చెట్టు నుండి తెల్లటి పొర మొదలైంది. క్రమేపీ అది కారడం స్టార్ చేసింది. వెంటనే ఆగకుండా పాల ధారలా కారుతూనే ఉంది. దీంతో.. దేవుడి మహిమ అంటూ పూజలు స్టార్ట్ చేశారు.

ఓ గ్రామంలో పొద్దున్న లేచి చూసే సరికి ఓ వేప చెట్టు నుండి తెల్లటి పొర మొదలైంది. క్రమేపీ అది కారడం స్టార్ చేసింది. వెంటనే ఆగకుండా పాల ధారలా కారుతూనే ఉంది. దీంతో.. దేవుడి మహిమ అంటూ పూజలు స్టార్ట్ చేశారు.

వేప చెట్టు నుండి ధారలా పాలు.. దేవుడి మహిమే అంటూ

ప్రకృతి ఎన్నో వింతల సమాహారం. అయితే ఎన్నడూ చూడని విడ్డూరాన్ని, కనివిని ఎరుగని సంఘటనలు చూసినప్పుడు అదంతా దేవుడి మహిమేనని బలంగా నమ్ముతుంటారు. కేవలం భగవంతునికే సాధ్యమని విశ్వసిస్తుంటారు. ఈ విశ్వాసాలను కొట్టిపారేయలేని సంగతులు కూడా చోటుచేసుకున్నాయి. గతంలో విగ్రహాలు పాలు, నీళ్లు తాగాయని.. స్పూన్ల కొద్దీ పట్టించేశారు భక్తులు. అయితే కొన్ని రాళ్లకు ఆ లక్షణాలుఉంటాయని సైంటిఫిక్ రీజన్ ఉందని చెప్పారు శాస్త్రవేత్తలు.ఇదిలా ఉంటే ఇప్పుడో వింత సంఘటన చోటుచేసుకుని వార్తల్లో నిలిచింది. దీంతో ఇదంతా దేవుడి మహిమ అంటూ పూజలు నిర్వహించారు స్థానిక మహిళలు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని వేప చెట్టు నుండి పాలు ధారలా కారుతున్నాయి. ఈ వింతను చూసేందుకు ఎగబడుతున్నారు

వేప చెట్టు నుండి పాలు సన్నటి జలపాతంలా కారుతున్న విచిత్రమైన ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.  ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని ఓ వేపచెట్టుకు పాలు ధారలా కారుతున్నాయి. ఈ విషయం ఊరంతా పాకిపోయింది. దీంతో ఈ వింతను చూసేందుకు తండోప తండాలుగా తరలి వెళ్లారు. మహిళలు ఇదంతా దేవుడి మహిమ అంటూ చెట్టుకు పూజలు నిర్వహించారు.  ఈ విషయం పాకి పక్క గ్రామాలకు కూడా చేరింది. దీంతో అక్కడ నుండి కూడా ఈ వేప చెట్టుకు వద్దకు వచ్చి ఈ వింతను చూశారు. మరికొంత మంది అయితే ఆ పాలను కవర్లలో నింపుకుని ఇంటికి తీసుకెళుతున్నారు.  బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారంటూ ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు.

ఈ విషయాన్ని నాస్తికులు, కొంత మంది సైన్స్ పరిజ్ఞానులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భూమిలో కెమికల్ రియాక్షన్ జరుగుతుందని.. అందుకే ఇలా వేపచెట్టు నుంచి తెల్లటి ద్రవం కారుతూ ఉండొచ్చని.. దీన్ని దైవ మహిమగా భావించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు.  అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై తొర్రల్లా ఏర్పడి.. చెట్టులో దాగి ఉండే నీరు బయటకు ఉబికి వచ్చి పాల ధారల్లా కారుతుందని అంటున్నారు. 50 ఏళ్లు దాటిన వేప చెట్లలో ఇలా ఎక్కువగా జరుగుతుందట. పల్లెటూరు కావడంతో అవగాహన లేక కొంత మంది దేవుడి మహిమ అంటూ పూజలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.  గతంలో కూడా చెట్టు నుండి పాల ధారలుగాా కారిన ఘటనలు కూడా వెలుగు చూశాయి.